9.9.10

నేను మళ్ళీ బొమ్మలు వెయ్యడం వెనుక కథ...

నేను స్కూల్ రోజుల్లో బొమ్మలు బాగా వేసేదాన్ని.

బాగా అనేది నా ఫీలింగ్ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పట్నుంచీ మొహమాటం కొంచెం ఎక్కువ పాళ్ళలో ఉన్నందువల్ల నేను వేసిన బొమ్మలు ఎవరో ఒకరిద్దరికి తప్ప చూపించేదాన్ని కాదు. చూసిన ఆ ఒక్కరూ ఇద్దరూ కూడా ఎప్పుడూ బొమ్మలో ఒక ఏదో వంక చూపించి నవ్వేవారు. దాంతో వెయ్యడమే మానేశాను. వేసినా ఎవరికీ చూపించకూడదని నిర్ణయించేసుకున్నాను.

ఇక కాలేజీలోకొచ్చాక బొమ్మలు వేసేంత తీరిక లేకపోవడానికి ముఖ్య కారణం పిచ్చాపాటి రాతల్లో మునిగి తేలడమే. ఇక అప్పట్నుంచీ పెన్సిల్ గీతలు నా నుంచి దూరమైపోతూ వచ్చాయి.

డిగ్రీ అయ్యేసరికి- "ఒకప్పుడు నేను బొమ్మలు వేసేదాన్ని..." అన్న విషయం కూడా మర్చిపోయాను.

మళ్ళీ ఇన్నాళ్ళకి...! సుమారుగా పదేళ్ళ తర్వాత... ఈ మధ్యే ఒక్కొక్కటీ వేస్తున్నా. అది కూడా పదేళ్ళ
క్రితం
చివరగా నేను వేసిన ఆర్ట్స్ చూసి అతను మరీ మరీ ప్రోత్సహించడంతో...

ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్నట్లుగా ఉంది...
షో కేసులో కనిపించిన బొమ్మలూ, గోడ మీది లామినేషన్లూ, ఏ బొమ్మ కనిపిస్తే దాన్ని గీసి పారేస్తున్నాను.

ఈ రోజు కొంచెం కుదురుగా కూర్చొని వేసిన బొమ్మ ఇది...

తను బావుందన్నా ఇందులో ఇంకేదో పర్ఫెక్ట్ నెస్ రావాలన్న ఫీలింగ్ నాకు...

12 వ్యాఖ్యలు:

Anil Dasari said...

Your outline strokes need to get much more fluid. పట్టి పట్టి గీసినట్లున్నాయి. ఇంకా, చేతులు రెండూ వేర్వేరు పరిమాణాల్లో ఉన్నాయి గమనించండి. ఎడమకాలు మడిచిన పద్ధతి అసహజంగా ఉంది. ముఖంలో భావాలు పలికించే విషయంలో కూడా కృషి చేయాలి.

మీకు స్కెచెస్ వేసే విషయంలో కన్నా రంగులద్దే విషయంలో ఎక్కువ నైపుణ్యం ఉన్నట్లుంది. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే అధివాస్తవిక శైలిలో మంచి వర్ణచిత్రాలు గీయగలరనిపిస్తుంది.

జాన్‌హైడ్ కనుమూరి said...

wonderful
congratulations

all the best

..nagarjuna.. said...

బొమ్మల్లో భావుకత వెతికేంత టాలెంటు మనకు (అనగా నాకు) ఏడ్చి చావలేదు కనుక దానిగురించి అబ్రకద్రగారిలా మాట్లాడబోను...రంగులు మాత్రం అద్భుతంగా వాడారు :)

gajula said...

adi feeling kaadu ,meere cheppandi ekkada lopamundho-aa bhomma nenu veshaananukuni chudandi.yemaina teliste saricheyyandi,e saari perfectgaa vastundi.(mitrulu,abrakadabra suchana gamaninchandi).all the best.

Anonymous said...

same as abrakadabra.

all the best.

Nagaraju said...

Hi,

Read my blog
gsystime.blogspot.com

You will get so much of information

thanks,
Nagaraju

గీతిక బి said...

అబ్రకదబ్ర గారూ... మీ సూచనలకి కృతజ్ఞతలండి

గీతిక బి said...

Thank you so much for your suggestions John garu, nagarjuna garu, gajula garu.

గీతిక బి said...

Thank you Anon.

గీతిక బి said...

Nagaraju garu.. chustanu mee blog...

Giridhar Pottepalem said...

గీతిక గారూ,
మీ గీతలూ, వాటికి మీరు వేసిన రంగులూ బాగున్నాయి. ఆర్ట్ కి స్ఫూర్తి, ప్రోత్సాహం రెండూ ఎంతో అవసరం. అలాగే, కుదురూ, ఇంకా బాగా వెయ్యాలన్న తపనా చాలా ముఖ్యం. కొన్నేళ్ళు గ్యాప్ వచ్చినా మళ్ళీ ప్రోత్సాహంగా, కుదురుగా మీరు చేసే ప్రతి ప్రయత్నం తప్పక ఫలిస్తుంది. కనపడినవన్నీ గీసేస్తుండండి (పారేయకండి, సరదాకన్నాను...), ఒకరోజు మీ ఆర్ట్స్ మీకే ఆశ్చర్యం కలిగిస్తాయి.
All the best.

గీతిక బి said...

Thank you so much Giridhar garu...