3.9.10

అభిసారిక...


అభిసారిక...
ఈ క్షణం
నువు నా చెంతన లేవని
కుంగిపోను నేను.
నా ఎదురు చూపులు
నిన్ను చూసి
జీవం పోసుకుని,
మిల మిల మెరిసే
క్షణాల కోసం..
ఆశ పడతాను.
వసంతం ఇచ్చే
చివురాకుల కోసం-
కోకిలలా,
చంద్రుడు చూసే
ఓర చూపు కోసం-
కలువలా,
నీ రాక కోసం...
నీ చుట్టూ
నా శ్వాసని ముడేసి,
క్షణ క్షణం
నీ తలపుల్ని శ్వాసిస్తూ,
నీ కోసం
ఎన్నాళ్ళైనా
ఎదురు చూసే
ఆశా జీవిని నేను...!

2 వ్యాఖ్యలు:

వేణూ శ్రీకాంత్ said...

కవిత సింపుల్ గా చాలా బాగుందండి.

geetika said...

thank you Srikanth garu..