16.1.11

మా సంక్రాంతి ముగ్గులే ఇవన్నీ...

హమ్మయ్య... ఇప్పటికి ముగ్గులయ్యాయి.

కానీ అసలైనదుంది ఇంకా...

అదేనండీ రధం ముగ్గు...!muggulu - muggu

14 వ్యాఖ్యలు:

అశోక్ పాపాయి said...

beautiful.

వేణూ శ్రీకాంత్ said...

మీముగ్గులు చూస్తుంటే తీర్చిదిద్దటమంటే ఏమిటో తెలుస్తుందండీ :) చాలా బాగున్నాయ్ ముగ్గులు. మరి రథం ముగ్గు, గుమ్మాల ముగ్గు కూడా వేసేశారా ఈ రోజు.

geetika said...

Thank you Ashok garu...

Thank you Venu Srikanth garu... రథం ముగ్గు ముక్కనుమ రోజు వేస్తారు. అంటే రేపు. ఈ రోజు సాయంత్రం వేసేస్తారు. నాకు ఉదయం చీకటితో లేచి ముగ్గు వేయడం అలవాటు. సో రథం ముగ్గు రేపు ప్రొద్దుటే వెయ్యాలన్నమాట.

భాస్కర రామి రెడ్డి said...

అబ్బో ఈ ముగ్గులన్నీ చిన్నప్పుడు నేనూ మా అక్కతో కలిసి వేసేవాడిని. కాకపోతే ఈ అక్కలున్నారే వాళ్ళు మాకు ఇలాంటి విషయాల్లో అస్సలు సహకరించేవాళ్ళు కాదు. అందుకని ఏంచేస్తాం..పక్కన ఏదో నాలుగు తెల్ల గీతలు గీసుకొని అసలు ముగ్గు చెడగొట్టి తృప్తి పడేవాడిని.

మాలా కుమార్ said...

చాలాబాగున్నాయి .

satya said...

రథం ముగ్గులు ఎందుకు వేస్తారు?

బొల్లోజు బాబా said...

geethika gaariki

your blog is nice.

i wonder you have been a blogger since long time.

the good morning concept is very very interesting

your poems are good and subtle

why do you stick to the concept of love only? (may be it is the silliest question. isnt it? :-)
I read many - in most of them the central theme is love even since way back from 2005 onwards.

Despite, you could still retain the freshness which i wonder-really really wonder)

any how i feel pleasure to visit your blog

thank you

bollojubaba

మనసు పలికే said...

గీతిక, భలే ముగ్గులు వేసారు. నేను కూడా చిన్నప్పుడు వేసేదాన్ని ఈ ముగ్గులన్నీ మా అమ్మతో కలిసి:)

geetika said...

//కాకపోతే ఈ అక్కలున్నారే...// అవునండీ ఈ పెద్దోళ్ళున్నారే... ఎప్పుడూ ఇంతే..!

కానీ వాళ్ళూ అనుకుంటారేమో... "ఈ చిన్నవా(తమ్ము)ళ్ళున్నారే.. ఎప్పుడూ ఇంతే.. ముగ్గులన్నీ చెడగొడతారు" అని...

Thank you for your comment భాస్కర రామిరెడ్డి garu...

geetika said...

Thank you Malakumar garu...

geetika said...

సత్యగారూ... ఆడపిల్లలం కాబట్టి ఏదో సరదా కొద్దీ ముగ్గులేస్తాం. మీరు ఇలాంటి డౌట్స్ అడగితే ఎలాగండీ...!!!

సంకురుడు అనే ఆయన్ని {ఈయన ధనుస్సు (ధనుర్మాసం) వచ్చేటప్పుడు వస్తారట} ఈ రథంలో సాగనంపుతారు. రథం ముగ్గుతో పాటూ ఆయన పాదాలు, ఆయనకు విసనకర్ర, గొడుగు అన్నీ ముగ్గులుగా వేస్తారట. కానీ ఇప్పుడు రథం ముగ్గు మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా.

వినాయకచవితి, దీపావళిల్లాగే సంక్రాంతికీ చాలా కథలున్నాయి. కానీ ఆ పండగల్లో ఆ కథల్ని చదివినట్లుగా, తలుచుకున్నట్లుగా.. సంక్రాంతికి దీని పుట్టుపూర్వోత్తరాలు పట్టించుకోకపోవడం వల్లేమో ఆ కథలన్నీ మర్చిపోయాం.

మన తరమే ఇలా ఉంటే మన తర్వాత వారికి....?

geetika said...

"ప్రేమలో మనం"కి స్వాగతం బొల్లోజు బాబా గారూ.
మీ అభినందలకి ధన్యవాదాలు.

ప్రతీ అమ్మాయికీ (అబ్బాయిలకీ) ప్రేమనే సున్నితమైన ఫీలింగ్స్ చాలా సాధారణం. అయితే రోజులు గడిచేకొద్దీ జీవితంలోని మజిలీలలో... ఆ ప్రేమ భావాలన్నీ మరుగున పడిపోతాయి. కానీ నా విషయంలో (నన్నే కాదు అందర్నీ, అన్నింటినీ) ప్రేమించగల అతను నా జీవితంలోకి ప్రవేశించడం నా అదృష్టం.

బహుశ అందుకేనేమో.. ఇంకా అప్పటి ప్రేమ అలా ఉండిపోయింది. ఆ కొత్తదనం ఇంకా కొనసాగుతూనే ఉంది.

నేను అనుభూతిస్తున్న ప్రేమ యొక్క అందం, రుచిని అందరూ కూడా ఆస్వాదించాలని, అనుభవించాలని ఎక్కువగా ప్రేమ గురించి వ్రాస్తుంటాను.

మీ వ్యాఖ్యకి మరోసారి ధన్యవాదాలండి.

geetika said...

Thank you so much Aparna garu. మరి ఈ సంవత్సరం ముగ్గులేం వెయ్యలేదా...?

NARENDRA said...

very Fine.....Narendra