19.1.24

saahithya.,com లో నా కొత్త సీరియల్ "హాంటెడ్... వెంటాడే ఓప్రేమకథ" (12-01-2024 నుంచి ప్రారంభం)

 ప్రియమైన మిత్రులందరికీ శుభసాయంత్రం...

saahithya.com డిజిటల్ లైబ్రరీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్రారంభమైన నా కొత్త సీరియల్ "హాంటెడ్... (వెంటాడే ఓప్రేమకథ)" మూడవ భాగం ఈరోజు అప్‌లోడ్ అయ్యింది.

"హాంటెడ్" సిరీస్‌లోని మూడు భాగాలూ చదవడం కోసం వెబ్‌సైట్ లింక్‌ను కింద ఇవ్వడం జరిగినది. గమనించగలరు...

https://saahithya.com/read


b.geetika writings - geetika novels - haunted - sahitya - Haunted series

16.1.24

ఈ సంవత్సరం (2024) మా సంక్రాంతి ముగ్గులు

 ప్రియమైన మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

ఈ సంవత్సరం మా సంక్రాంతి ముగ్గులు





muggulu - 
pongal rangoli

17.11.23

సాహిత్య.కాం ప్రారంభం సందర్భంగా "అరంగేట్రం కథల పోటీ"...

ప్రియమైన రచయిత(త్రు)లకు, పాఠక మిత్రులకు ఒక శుభవార్త...

సాహిత్య.కాం వెబ్సైట్ వారు సాహిత్య.కాం ప్రారంభం సందర్భంగా "అరంగేట్రం కథల పోటీ"ని నిర్వహిస్తున్నారు.

ఆ వివరాలు అందరి కోసం... 

--------‐--------‐----‐‐-----------

అరంగేట్రం కథల పోటీ బహుమతుల వివరాలు

మొదటి బహుమతి      5,000

రెండవ బహుమతి      2,500

మూడవ బహుమతి     1,000

ఇవి కాక ఎంపిక చేసిన ప్రతి కథకీ 300/- గౌరవ పారితోషికం, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. 

కథల పోటీ నిబంధనలు:-

1. కథాంశం మీ ఇష్టమే అయినా పట్టుగా చదివించి, మనసుకి హత్తుకునే, ఆశావహ దృక్పధంతో ఉన్న వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యం.

2. మీరు పోటీకి పంపే కథలను saahithyacontest@gmail.com అనే ఈమెయిల్ ఐడీకు పంపాలి. మీ కథ అనువాదమూ, కాపీ కాదనే హామీని ఈమెయిల్లో వ్రాయాలి. కథలపోటీకి సంబంధించిన ప్రశ్నోత్తరాలకి ఈ ఈమెయిల్లోనే సంప్రదించాలి.

3. కథ ఎ4 సైజులో డిటిపి చేసిన పిడిఎఫ్ ఫార్మెట్లో గానీ, యూనికోడ్లో గానీ 10 పేజీలు ఉండాలి.

4. మీరు పోటీకి పంపుతున్న పోటీ కథలను సాహిత్య.కాం లో మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ ఎకౌంట్లో తప్పకుండా అప్లోడ్ చెయ్యాలి.

5. కథలను ఎంపిక చెయ్యడానికీ, కథల పోటీ గడువుని పొడిగించడానికీ, పోటీని రద్దు చేయడానికి, బహుమతి మొత్తాలలో మార్పులూ చేర్పులూ చెయ్యడానికీ సాహిత్య.కాం యాజమాన్యానికి సర్వహక్కులూ ఉన్నాయి.

అరంగేట్రం కథలపోటీ కోసం కథలను పంపాల్సిన ఆఖరి తేదీ 30-11-2023

మీ కథలను పంపాల్సిన ఈమెయిల్ ఐడీ... saahithyacontest@gmail.com

--------‐--------‐----‐‐-----------

మీ సందేహాలకు, మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్‌ని కాంటాక్ట్ చెయ్యండి.. ఫోన్: 9030959777 

7.10.23

"చదువు" యాప్‌లోని నా నవలలు...

 ప్రియమైన మిత్రులందరికీ శుభోదయం... 

"స్వాతి వీక్లీ"లో వారంవారం నా సీరియల్స్ చదువుతూ, అవి నవలలుగా ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్న అభిమాన పాఠకులందరికీ శుభవార్త.. 

ఇప్పుడు నా నవలలు ఆన్‌లైన్‌లో మీకు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ మీద నేను వ్రాసిన, చాలా అద్భుతమైన రెస్పాన్స్ పొందిన నా "చెలగాటం" నవల, అలాగే రోబోటిక్ టెక్నాలజీ పై నేను వ్రాసిన "అందాల ఆడబొమ్మ" నవల ఇప్పుడు "చదువు" యాప్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి.

అలాగే నా నవలలు మీరు ఇంకా యేమేమి చదవాలి అనుకుంటున్నారో తెలియజేస్తే వాటిని కూడా "చదువు" యాప్‌లో మీకు అందుబాటులోకి తెస్తాను. 

మీరు ఇప్పటికే "చదువు" మొబైల్, టాబ్ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉంటే నా రచనల్ని మీరు ఉచితంగా చదువుకోవచ్చు. నా రచనలతో పాటూ ఇంకా అనేకమంది రచయిత(త్రు)ల ఎన్నో రచనల్ని కూడా మీరు ఉచితంగా చదవొచ్చు. చదివే వీలు లేనప్పుడు వేరే పనులు చేసుకుంటూ కొన్నిటిని ఆడియో రూపంలో కూడా వినొచ్చు. 

ఒకవేళ మీరు కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే సంవత్సరానికి ఋస్. 399/- మాత్రమే. ఈ ప్లాన్‌తో సంవత్సరం అంతా ఎన్నో పుస్తకాల్ని అన్‌లిమిటెడ్‌గా చదువుకోవచ్చు, ఆడియో బుక్స్‌ని కూడా వినవచ్చు.


28.6.23

"స్వాతి వీక్లీ" 16 వారాల సీరియల్స్ పోటీ ఫలితాలు

ప్రియమైన పాఠకులు అందరికీ శుభసాయంత్రం..

"స్వాతి వీక్లీ" 16 వారాల సీరియల్స్ పోటీలో నేను వ్రాసిన "డెత్ సీక్రెట్" సీరియల్ లక్ష రూపాయల బహుమతి పొందింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.. 💗

24.3.22

"స్వాతి వీక్లీ"లో నా లేటెస్ట్ సీరియల్ "అందాల ఆడబొమ్మ" ఎనౌన్స్‌మెంట్స్...

"స్వాతి వీక్లీ"లో ప్రచురితం కాబోతున్న నా లేటెస్ట్ సీరియల్ "అందాల ఆడబొమ్మ" గురించి స్వాతి వీక్లీలో పబ్లిష్ అయిన ఎనౌన్స్‌మెంట్స్... 


14.2.20

"కామరూపం" స్వాతి వీక్లీలో కొత్తగా ప్రారంభమవుతున్న నా సీరియల్...

ప్రియమైన బ్లాగ్ మిత్రులందరికీ శుభోదయం... 
"స్వాతి వీక్లీ" 07-02-2020 సంచికలో 
నా కొత్త సీరియల్ "కామరూపం" ప్రారంభమైంది. 
"కామరూపం" వారం వారం మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను.
బ్లాగ్ మిత్రులందరూ చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకోగలరు... 





swathi weekly -  kamaroopam 
b.geetika novels - swati novels
kamarupam serial

22.4.19

ఈ వారం నుంచీ స్వాతి వీక్లీలో నా కొత్త సీరియల్ "చెలగాటం"...

ప్రియమైన బ్లాగ్ మిత్రులందరికీ శుభసాయంత్రం. 
 వారం నుంచీ "స్వాతి వీక్లీ"లో 
నా కొత్త సీరియల్ "చెలగాటంప్రారంభమైంది. 
చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను. 





swati weekly - geethika b - swati serial
chelagatam serial - b geetika

5.3.18

ఈ నెల "స్వాతి మాసపత్రిక"లో నా నవల.. -- "డేంజరస్ గై" --

బ్లాగ్ మిత్రులందరికీ శుభోదయం.

"స్వాతి మాసపత్రిక"లో ఈ నెల అనుబంధంగా వచ్చిన నా నవల
-- "డేంజరస్ గై" --
చదువుతారని ఆశిస్తూ...

4.6.16

my new novels....


my latest published novels...

b.geetika - geethika novels - swati novels