31.8.14

బాపు గారికి ఆశృ నివాళి....ఆకృతిని మీ గీతల్లో
ప్రకృతిని మీ రంగుల్లో
భావాల్ని మీ సినిమాల్లో
ఉద్వేగాల్ని మీ స్నేహంలో
ఊహ తెలిసినప్పటి నుంచీ 
చూస్తూనే ఉన్నాను..!

నే వ్రాసిన కథకి మీ కలం నుంచి 
జాలువారిన చిత్రాన్ని చూసి,
మురిసిపోయానుగానీ.. ఆ చిత్రాన్ని ఇలా
మీకు సంతాపం తెలపడానికి
ఉపయోగించాల్సిరావడం చూసి 
ఇప్పుడు దుఃఖిస్తున్నాను..!!

బుడుగు బొమ్మల్నీ
అందమైన ఆడపిల్లల్నీ
కార్టూన్లతో పంచిన హాస్యాన్నీ
కన్నీరు పెట్టించిన శ్రీరామరాజ్యాన్నీ
చూసినప్పుడల్లా.. మిమ్మల్ని కలవాలి,
మీతో మాట్లాడాలి అనుకుంటూనే...

ఎప్పటికీ మిమ్మల్ని కలవలేనంత
ఆలశ్యం చేసినందుకు చింతిస్తూ... ... ....

(స్వాతి వార పత్రికలో ప్రచురితమైన నా కథ "బంధం సంబంధం" కు బాపుగారు వేసిన బొమ్మ)


bapu - swati weekly - geethika b

1 వ్యాఖ్యలు:

హను said...

okkasari ayanani kalavali anna naa aaSa kuda aaviraipoyindi

chala bhadakara vishayam