20.8.13

వెయ్యిన్నొక్క ముక్కలు

వెయ్యిన్నొక్క ముక్కలు


ఒక్కటిని 
రెండు చేస్తే 
ఇద్దరివీ అవుతాయ్ 
పదవులు..! 

రాష్ట్రాన్ని 
రాష్ట్రాలు చేస్తే
నలుగురివీ అవుతాయ్
అధికారాలు..! 

ముచ్చటైన అద్దాన్ని
ముక్కలు చేస్తే
ఎవరికి కావల్సింది
వారు ఏరుకోవచ్చు..!

నిధులు రాల్చని
ఖజానాకి 
కావల్సినంత 
పన్నుల పెన్నిధులు..! 

కానీ..
కలుసున్నా, బద్దలైనా
మారనిది ఒక్కటే_ 
కూటికిలేని కూలోడి కత..! 

ఆ బక్క బతుకులోని 
ఒక్కో వెతా ముక్కలైనట్టు 
వందల వెతలు 
మిగిలే ఉంటున్నాయ్..! 

పాలనలెన్ని మారినా 
పాపం..
మారనిది
కూలోడి కతే..! 

(Andhra Bhoomi Sahiti - 19-8-13)




geetika kavita - veyyi mukkalu - b.geethika - andhra bhoomi

5 వ్యాఖ్యలు:

హను said...

chala baga chepparu andi

గీతిక బి said...

Thank you Hanu garu..

Unknown said...

చాలా బాగుంది

Unknown said...

చాలా బాగుంది

గీతిక బి said...

ధన్యవాదాలు మరియు నా బ్లాగులోకి స్వాగతం.. రావి రంగారావు గారూ..