26.8.13

జాగృతి వారపత్రిక మహిళా సంచికలో నేను వ్రాసిన వ్యాసం..

        సేవ అంటేనే గుర్తుకు వచ్చేది స్త్రీ.
మానవ సేవలో ముందున్న మహిళ ఆధ్యాత్మికతలో మాత్రం వెనుకబడే ఉంది.
ఆధ్యాత్మిక రంగంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే శారదా దేవి, సిస్టర్ నివేదితలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞాన్నాన్ని సముపార్జించారు. వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చేపడుతూనే, మానవతా దృష్టితో మానవసేవ చేస్తూ; మానవసేవే మాధవ సేవ అని చాటి చెప్పారు.
ఈ కాలపు స్త్రీలు వారినుంచి నేర్చుకోవల్సిన సహనం, సేవలాంటి ఎన్నో గుణాలు వారిలో మెండుగా ఉన్నాయి.

సిస్టర్ నివేదిత

సిస్టర్ నివేదిత 28 అక్టోబర్ 1867 న ఐర్లాండ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. ఆమె తల్లి మేరీ ఇసాబెల్ మరియు తండ్రి సామ్యూల్ రిచ్మండ్ నోబుల్. 
చిన్నతనం నుండి యుక్తవయసు వచ్చేవరకు మార్గరెట్ ఐర్లాండ్‌లో పెరిగారు. ఆమె చిన్నతనంలోనే తండ్రి నుండీ, గురువుల నుండీ ఎన్నో విలువైన విషయాల్ని తెలుసుకున్నారు. మరెన్నో పాఠాల్ని నేర్చుకున్నారు. మతాధికారి అయిన తండ్రి సామ్యూల్ ఆమెకు చిన్నతనంలోనే.. మానవులకు చేసే సేవే దేవునికి చేసే నిజమైన సేవ అనే పాఠాన్ని బోధించారు. 
కానీ మార్గరెట్‌కు పది సంవత్సరాల వయసులో అంటే 1877 లో ఆమె తండ్రి శామ్యూల్ మరణించాడు. ఆ తరువాత ఆమె తన అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లో పెరిగారు. 

* * *

* * * 

* * *
jagruti weekly - geethika

0 వ్యాఖ్యలు: