14.11.11

జాగృతి బహుమతి కథ...

సహజీవనం
నల్లగా ఉన్న రాతిరి మలి ఘడియలు చాలా చల్లగా ఉన్నాయి.
నా చుట్టూ... బోలెడు చెట్లు, వాటి బలాన్ని చాటే కోటానుకోట్ల ఆకులు, కొమ్మలూ; కొమ్మల మధ్య చిన్న చిన్న పక్షుల గూళ్ళు... నా చుట్టూ ఇంత జీవమున్నా ఏ అలికిడీ లేదు వాతావరణంలో. మరీ పట్టిపట్టి చూస్తుంటే తెలుస్తోంది మంచు కురవడం. ఆకుల మీద పడిన మంచు బిందువులన్నీ ఏకమై ఉండుండీ చినుకులుగా కురుస్తున్నాయి. అయినా నిశ్శబ్దమే నా చుట్టూ... ప్రశాంతత నిండిన నిశ్శబ్దం..!
అలవాటైన ప్రకృతే... అయినా పరవశిస్తూ వాకిలి ఊడ్చే పనిలో పడ్డాను.
నిండైన ముగ్గు ముగించే వేళకి వేకువ మొదలైంది... కువకువలతో.
ముగ్గు గిన్నెతో లోపలికి వస్తుంటే పక్కింటి గేటు శబ్దమైంది. అప్రయత్నంగా నా తల అటు తిరిగింది. ఇన్ని రోజులుగా చూస్తున్నా... పక్కింటి మామ్మగారు ఉదయాన్నే వచ్చి ముగ్గునీ, ముగ్గు వేస్తున్న నన్నూ మార్చిమార్చి చూస్తోంది ప్రతిరోజూ.
నేను ఓరగా ఆవిడని చూస్తే... ఆ ముసలావిడ వింతగా ముగ్గు వంకే చూస్తూ...!
* * *
నాన్నకి ప్రమోషన్‌తో పాటూ ట్రాన్స్‌ఫర్ రావడంతో మేము ఈ మధ్యనే ఈ ఊరికొచ్చాం.
అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఒక చెల్లి, తమ్ముడు. నాకు ఊహతెలిసే వరకూ నాన్నే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. హైస్కూలుకొచ్చాక పెద్ద కూతురుగా ఆ బాధ్యతని నేను తీసుకున్నాను. మొన్నే బికాం ఫస్ట్ క్లాసులో పాసై, పిజికి అప్లికేషన్ పెడదామనుకునేంతలో ఈ ట్రాన్స్‌ఫర్..! చెల్లి డిగ్రీ రెండో సంవత్సరం, తమ్ముడేమో ఇంటరూ. వాళ్ళిద్దరి చదువుల గురించే ఇబ్బందిప్పుడు. ఇక్కడ్నుంచి రెండు బస్సులు మారి, రెండు గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి కాలేజీకి. వాళ్ళకోసమే నేనింత ప్రొద్దుటే లేచి వంట, క్యారేజీల పనిచూడ్డం.
* * *
ఓ రోజు పక్కింటి మామ్మగారు "అమ్మా.. మధురిమా.." అంటూ వచ్చారు.. పెద్ద పళ్ళెంలో పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు... అన్నీ నిండుగా పెట్టి తీసుకొచ్చి.
'ఏంటండీ విశేషం..' అంటే 'ఈ రోజు తమ పెళ్ళి రోజ'న్నారు.
"ఇది ఎన్నో పెళ్ళి రోజు..?" అనడిగాను ఆవిడని కూర్చోమని కుర్చీ చూపిస్తూ.
"స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్ళో మా పెళ్ళయ్యి అన్నేళ్ళు" అందావిడ నవ్వుతూ.
తర్వాత ఆవిడే అంది... "తెల్లదొరల నుంచి స్వాతంత్ర్యం వచ్చేవరకూ నిన్ను పెళ్ళిచేసుకునేది లేదు.. అని తాంబూలాలైన పెళ్ళిని నాలుగేళ్ళు వాయిదా వేశారు మీ తాతయ్యగారు." అంది సగం నవ్వుని దాచుకుంటూ. అందులోని సిగ్గు అస్పష్టంగా కనిపించింది. "ఆ నాలుగేళ్ళూ ఆయన నాకూ, వాళ్ళవాళ్ళకి దూరంగా.. స్వాతంత్ర్య పోరాటం సల్పే ఇతర యువకుల రహస్య స్థావరాల్లోనే. ఎంత పట్టుదలనుకున్నావ్ మీ తాతయ్యగారిదీ..! ఇరువైపుల వాళ్ళనీ ఒప్పించడం ఒకెత్తయితే నన్నొప్పించడం ఒకెత్తు అంటారిప్పటికీ.." మళ్ళీ ఆవిడ బుగ్గల్లో సిగ్గులు.
ఆ రోజు నుంచి ఆవిడతో నా పరిచయం చూపులు, చిరునవ్వుల్ని దాటి మాటల వరకూ సాగింది. ఆవిడ పేరు అనంత లక్ష్మి. అందరూ అనంతా, అనంతమ్మగారు అంటారు. అనంతమ్మగారు మనసుల్ని చదవగల నేర్పరే కాదు మనసెరిగి నడుచుకునే ఇల్లాలూనూ. ఆవిడకి ముగ్గులంటే చాలా ఇష్టమట. 'ఈ రోజుల్లో ఆడపిల్లలకి ముగ్గులెయ్యడమే రాదు..' అంటూ నేను వేసే ముగ్గుల్ని మెచ్చుకునేది.
నాకూ వచ్చేది కాదేమో.. మా అమ్మ బతికుంటే.
* * *
* * *
* * *
* * *
* * *

18 వ్యాఖ్యలు:

bhagavandas said...

katha asaantham chaduvuthu chaduvuthu undaga.. chaduvuthunna page tellagamarindi... nallani akshralu kanipinchadam ledu... naa kallalo kanneeru, naaku teliyakundane "తాతయ్య నిర్జీవంగా... మామ్మ జీవశ్చవంలా... " ఆమె ఈ లోకంలో ఉన్నట్లు లేదు.. నేను రావడమూ తెలీనట్టే ఉంది. ఈ ప్రపంచంలో తాతయ్య ముఖం తప్ప మరేమీ లేనట్టుగ తాతయ్య ముఖంలోకే చూస్తోంది. taataiah kanna maamma gurinche badha ekkuvaindi naaku. kallu thuduchukuni chaduvuthundagane... maamma kuda tanuvu chalinchindi ani telisaka malli kanneeru agaledu... naaku naa kallalo..

జ్యోతిర్మయి said...

మేఘ సందేశం చిత్రం గుర్తొచ్చింది మీ కథ చదివితుంటే ..మనసుని సున్నిత౦గా స్పృసిస్తున్న భావన.
అభినందనలు.

రసజ్ఞ said...

ఎంతో అద్భుతమయిన కధనం! చాలా చక్కగా వ్రాశారు. మామ్మగారి లాంటి అనుభవజ్ఞుల అండ ఎప్పుడూ మనకి ఉంటే ధైర్యంగా ముందుకి సాగుతూనే ఉంటాము. ఆవిడ మరణం నాకు కూడా బాధ కలిగించింది.

Kathi Mahesh Kumar said...

One of the most regressive stories I have read in recent years. నీతులు బోధించవలెను, (వాళ్లనుకున్న మిథికల్)విలువలను కాపాడవలెను అనుకునే పత్రికలున్నన్నినాళ్ళూ ఇలాంటి కథలకు ప్రైజురావడంలో ఆశ్చర్యం లేదు.

మీ రచనా శైలి బాగుంది. ప్రైజుకోసమే కథ రాసుంటే అభినందనలు. ఈ కథ సహజంగా మీ ఆలోచనలోంచీ వచ్చుంటే నా సంతాపం.

Anonymous said...

Regressive.. seriously? What do you find regressive in this story?

కృష్ణప్రియ said...

@ మహేశ్ కుమార్ గారు,

ఈ కథ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే 'కష్టం,సుఖం రెండింటిలో కూడా కలిసి జీవితం లో కలిసి అనుభవించటం, తోడు నిలవగలగటమే, నిజమైన సహజీవనం! సమాజం అప్రూవల్ (పెళ్లి) మాకక్కర లేదని సుఖం గా జరిగినంత కాలం కలిసి ఉండి, కష్టం రాగానే/మోజు తీరగానే విడిపోవటం కాదు' అని.

ఈ కథ లో కథానాయకురాలు కన్ఫ్యూజన్ లో ఉండి, చివరకి తనకి కష్టం వచ్చినప్పుడు భర్త ఓదార్పు తో, 'అవును కదూ.. ఇదే కదా సహజీవనం అంటే? ' అనుకుంది.

Which is a good message!

ఇక మామ్మగారు ఎనభైల్లో పడ్డాక కూడా భర్త కి నలుగు పెట్టి స్నానం చేయించి రకరకాల సేవలు చేసి, భర్త పోయిన రోజే, గుండె ఆగి మరణించటం...

ఏమో! ముప్ఫైల్లో ఉండి, పిల్లలకి వారానికోసారి షాంపూ తో స్నానం చేయించాలంటేనే తల ప్రాణం తోక కొస్తోంది. ఇంటి పనీ, బయట పనీ,పిల్లల పనీ కలిసి చేసుకునే మెట్రో సంస్కృతి లో ఉన్నందు వల్ల, భర్త కి ఇలాంటి సేవలు చేసే పద్ధతులూ, అలవాట్లూ, ఆలోచనలూ ఈ జెనరేషన్ లో లేనందువల్లా.. నేను ఆ పార్ట్ 'ఆ కాలపు భార్యా భర్తల జీవన విధానం ' గా మాత్రమే చూసి వదిలేశాను.

రిగ్రెస్సివ్ .. అని నేననుకోను.

@ గీతిక గారు,

కంగ్రాట్స్.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Mahesh,

I think you got carried away a bit. I do not see any thing regressive in this story..

It just portrayed different things.. with out glorifying the fringe items. the story tried to tell what living together is whether in marriage or outside it. I don't think it is regressive in nature.

for my taste the plot is a bit bland. But that's a different thing altogether.

Mauli said...

ముందు ఎపుడో అయితే ఇవి లైట్ అనుకున్నా కాని, లాస్ట్ ఇయర్ మా బంధువులలో ఇలా౦టి జ౦ట మరణం సంభవించినది . (ఒకరిది మాత్రమె సహజ మరణం )

కాని కధ లో సహజీవనం ఫెయిల్యూర్ కి ఇది అతకలేదనిపిస్తున్నది.

shri said...

గీతిక గారూ,
సహజీవనం కథ చాలా బాగుంది.మీకు హార్థిక
అభినందనలు.

శ్రీదేవీ మురళీధర్

గీతిక బి said...

@ Anonymous: ధన్యవాదాలు Anonymous గారూ.

@ కృష్ణప్రియ: కృష్ణప్రియ గారూ... మీ వ్యాఖ్యకి, వివరణకి ధన్యవాదాలండీ.

@ Weekend Politician: వీకెండ్ పొలిటీషియన్ గారూ... మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండీ.

@ Mauli: మౌళీ గారూ... ధన్యవాదాలండీ.

@ శ్రీదేవి: శ్రీదేవి గారూ... మీ అభినందలకి ధన్యవాదాలండీ.

Anonymous said...

hello andi bhavundi, nenu anand......

shri said...

రంజని కథానికల పోటీ గెలిచినందుకు అభినందనలు..
శ్రీదేవి

గీతిక బి said...

Thank you Anand..

గీతిక బి said...

Sreedevi garu.. ధన్యవాదాలండీ.

గీతిక బి said...

@ bhagavandas: థ్యాంక్యూ భగవాన్ దాస్.

@ జ్యోతిర్మయి: జ్యోతిర్మయి గారూ... నేను మేఘసందేశం చూడలేదండీ. తప్పని సరిగా చూస్తాను. మీ అభినందనలకి ధన్యవాదాలు.

@రసజ్ఞ: ధన్యవాదాలు రసజ్ఞ గారూ. పెద్దవాళ్ళ అనుభవాలు మనకి పాఠ్యాంశాల్లో కూడా ఉండనివి కదండీ.

@ Kathi Mahesh Kumar: మహేశ్ గారూ... అభిప్రాయాలు మనం పెరిగిన వాతావరణం, ఎదురైన పరిస్థితుల్ని బట్టి ఉంటాయండీ. వాటి బట్టే మన నమ్మకాలు కూడా. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండీ.

sam said...

నిజంగా మంచి కథ
Telugu News
Online Breaking Telangana News

Suryaa said...

పంచుకున్నందుకు ధన్యవాదాలు
Telangana News

గీతిక బి said...

Thank you very much Sam garu and Suryaa garu.