23.8.10

ప్రియమైన... నీ కోసం...

బేధాభిప్రాయాల నీడలు ఎన్ని వచ్చినా
మనల్ని కదిలించలేవని,
వాన చినుకులంత
స్వచ్ఛమైన చిరునవ్వుల్తో..
పగలే వెన్నెలలయ్యే మోహావేశంతో..
వెన్నెలలూ వేడనిపించే
కోరికల గాడ్పుల మధ్య-
అరుణిమలు నింపుకునే
తనువుల తన్మయత్వానికి
గాఢానుబంధనాల సౌఖ్యాన్ని జతచేస్తూ,
సాగే నిశ్శబ్ద యుద్ధంలో-
ప్రశాంతానుభూతిని గుండెనిండా నింపుకుంటూ
ఒకరి వెన్నంటి మరొకరుగా
మసలే మన జీవన ప్రయాణంలో
ఇరువురమూ ఒకరమేనని
ఒక్కటిగా కలిసిపోవాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ...
ఇలాంటి పుట్టినరోజులెన్నో
మనిద్దరిమధ్యా జ్ఞాపకాలై
మధురానుభూతినివ్వాలని ఆశిస్తూ...
ప్రేమతో.....

ఎప్పటికీ-
నీ నేస్తం

9 వ్యాఖ్యలు:

Anonymous said...

nestam nee kosam ani kaakundaa priyaa neekosam ani title pedite bagundedi. nestaala madhya korikala gadpulu undavu kadaa..challanaina sneha bhavam, aapyaayata prema tappa.

geetika said...

ధ్యాంక్సండీ... మీరు చెప్పింది కరెక్టే. కానీ నాకు తనని "నేస్తం" అని పిలిచే అలవాటు.. అందువల్లనే ఇలా. అయినా సరే మీరన్నట్టు టైటిల్ మారుస్తాను.

hanu said...

i think he is very lucky... anDi meelanTi nestam dorakaDam nijam ga chala great

సవ్వడి said...

baagundi..

geetika said...

అలా ఎందుకనుకోవాలి Hanu..? తను దొరకడం వల్లే కదా... నాకు ప్రేమ గురించి తెలిసింది. So నేనే లక్కీ కదా.

geetika said...

thank you SavvaDi garu.

nagseenu said...

ఒక అమ్మాయి ఇలా ఎలా రాయగలిగిందో అని ఆశ్చర్యం వేస్తోంది. మీ వల్ల అతను అదృష్టవంతుడో లేక అతని వల్ల మీరు అదృష్టవంతులో..మీ భావనలో మేము కొట్టుకుపోయాం

geetika said...

నాగశీను గారూ...

ఇందులో అమ్మాయైతే వ్రాయలేకపోవడానికి ఏముంది..?

నా వల్ల తననీ... తన వల్ల నేననీ... ఎవరం అదృష్టవంతులమో మేమే తేల్చుకోలేకపోయాం ఇప్పటికీ.

vennela kumar said...

wow good post