16.7.10

ప్రేమో.., మాయో..., ప్రేమే మాయో...!



ప్రేమో.., మాయో..., ప్రేమే మాయో...!

ఈ చిన్ని మనసులో
ఏదో అలజడి...!
ఎందుకో తెలీక
అది ఏదో అర్థం కాక
వాన జల్లుల్లో స్వాతి చినుకై..
తుషార తుంపరల్లో నీటి బిందువై..
ఘనీభవించిన జ్ఞాపకాలు,
కరిగిపోయిన కాలప్రవాహ ఒరవడిలో
మిగిలిపోయిన గతం తాలూకు స్మృతులు,
ఎన్నో...!
ఎవరో గిలిగింతలు పెట్టినట్లు
ఏవో జ్ఞాపకాలు తికమక పెడుతుంటే
నా మనసులో
అదేదో అలజడి (?)
అది ఇష్టమో, అభిమానమో, ఆరాధనో...
నాతో దాగుడు మూతలాడుతూ
తన చిరునామా తెలుపక
నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది.
ఆ పిచ్చి ఏదో కాదు...
'మనసు'లో పుట్టిన ప్రేమ వల్ల
'మన' లో కలిగే పిచ్చి...!
ఎదురుగ ఎందరున్నా
అందర్లోనూ నువ్వే కనిపిస్తూ,
ఎవరి మాటలు వింటున్నా
నీ పిలుపులే ప్రతిధ్వనిస్తూ,
ఏంటీ మాయ...?
ప్రేమంటే మాయా...?
? ? ? ? ? ? ?
ఈ నీలికనులు కూడా...
వ్యక్తం చేయలేని భావాలు
ఎన్నో నాలో
అర్థం చేసుకోగలవా... నేస్తం...!

5 వ్యాఖ్యలు:

హను said...

premanTe maye mari

గీతిక బి said...

అది అనుభవమైతే గానీ అర్థం కాదేమో.

Padmarpita said...

కవిత, బొమ్మ రెండు బాగున్నాయండి!

గీతిక బి said...

thank you Padmarpita garu.

narsimmurthy said...

చాలా బాగా రాసారు.
ప్రేమ రాహిత్యం గురించి ఎమైనా రాసారా