21.7.10

ఎందుకని...?మెరుపులా తాకింది నీ చూపు
కరిగిపోతానంటున్న మనసును కరడుగట్టించేదెలా...?

చివురుల్లో దాగిన మొగ్గలా
నన్ను నీలో దాచేస్తుంటే
నీ అపురూపం చూసి మురిసిపోతున్నాను.

మన్నుని తడిపి జీవం పోసే వానలా
నుదురు వంచి ముద్దులాడిన
నీ అనురాగం చూసి పొంగిపోతున్నాను.

పెనుతుఫానులా
నన్ను చుట్టుకుపోతుంటే మాత్రం
కంగారుపడుతున్నాను... ఎందుకని...?

నీ సాహచర్యంలో
ఈ కంగారయినా
మధురంగానే ఉంది... ఎందుకని...?

2 వ్యాఖ్యలు:

సావిరహే said...

nice pick and poetry :-)

enti geethika gaaru ee madya assalu ravatam ledu ,busy ayipoyaara?

geetika said...

thank you Savirahe గారు.

ఏవో చిన్న పనుల వల్ల సిస్టంకి దూరంగానే ఉంటున్నాను.