28.7.12

బహుమతి కథ... మట్టిమనిషి

ఆంధ్రభూమి దినపత్రిక మరియు నాటావారు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన నా కథ... మట్టిమనిషి మొన్న ఆదివారం (15-07-12) ఆంధ్రభూమి అనుబంధంలో ప్రచురితమయ్యింది.

ఆ కథ, లింక్ ఈ క్రింద...

http://www.andhrabhoomi.net/specials/AADIVAVRAM%20-%20Eevaaram%20Katha/content/matti-manishi



ఒక మొలక.. ఒక చిన్ని మొలక.. మన్నులోంచీ, నీళ్లలోంచీ, రాళ్లలోంచీ, ఇసుకలోంచీ.. చీల్చుకురాగలంత బలమైన పసి జీవి. అలాంటి ఎన్నో పసి జీవుల తోటైన ‘ఆకుమడి’ అది...! సాయంత్రపు ఎరుపెండకి నల్లమట్టిలోని పచ్చని ఆకు మడి మరకతాల్ని ఆరబెట్టినట్టుగ మెరుస్తోంది.
‘సుమా..! నేను ధీరూని తీసుకురావడానికి వెళ్తున్నాను..’ సైకిల్ తాళాన్ని చూపుడు వేలితో గిరగిరా తిప్పుతూ వరండాలోకొచ్చాడు గిరి. తలూపి, వెళ్తున్న గిరి వైపే చూస్తూ నిలబడ్డాను.
ఒకే ఊరివారమైనా గిరితో నాకు పరిచయమైంది మాత్రం మేం కలిసి చదివిన డిగ్రీ కాలేజీలోనే. ఎన్నో మాటలు. భావాలు పంచుకున్నాక మనసులిచ్చి పుచ్చుకున్నాం. గిరి ననే్న చేసుకుంటానని పట్టుబట్టడంతో, అతని మొండితనం గురించి నాకంటే బాగా తెలిసిన గిరి తల్లిదండ్రులు.. మా పెళ్లికి ఒప్పుకున్నా, పెళ్లయ్యాక మాతో వేరుకుంపటి పెట్టించి మాటలు, రాకలు తగ్గించేవారు. వాళ్ల బాధ్యతగా.. ఉన్న ఆస్తిపాస్తుల్ని వాటాలేసి పిల్లలందరికీ పంచిచ్చేశారు. గిరీ వాటాగా రెండెకరాల పొలం వచ్చింది. అప్పట్నుంచీ చేస్తున్న ఉద్యోగం మానేసి పొలం పనులు చూసుకుంటున్నాడు. ఈ నేలతల్లి మా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తూనే ఉంది. ఒద్దికైన చిన్న పూరిల్లు, రెండెకరాల చేనూ, ముద్దులు మూటగట్టే మా బాబు ధీరజ్.. ఇవే మా ఆస్తి అంతస్తులూ.
ఒకట్లోంచి రెండో తరగతిలోకొచ్చిన ధీరూగాడిని చూస్తుంటే వ్రేలెడు నుంచి మూరెడు కెదిగిన చేనుని చూస్తున్నంత ఆనందం వేస్తుంది. మొత్తం మీద ఏ సమస్యలూ, కష్టాలూ లేని అందమైన సంసారం మాది.
చీకటి పడుతుండగా వచ్చాడు గిరి. ఆలస్యమైందేంటోనని ఎదురెళ్లి ధీరజ్‌ని అందుకున్నాను.
గిరి చేతిసంచిలోంచి పేరాకాట్ డబ్బా తీసి అటక మీద పెట్టాడు. అది పొలంలో కలుపు మొక్కలు రాకుండా చేసే పురుగు మందు. ‘కలుపు బాగా పెరిగిపోతోంది. మందు తేవాలని’ వారం నుంచి అంటున్నాడు గిరి. దాని గురించే ఆలస్యమైందని అర్థమైంది నాకు. వాళ్ల స్నానాలకి ఏర్పాట్లు చేయడంలో పడ్డాను.
* * *
‘అమ్మా.. అమ్మా! ఈ గింజ అలాఆఆఆ... మొక్కైపోతుందా..’ కళ్లింత చేసుకుని పొలాల వైపు చూపిస్తూ నమ్మలేనట్టు అడిగాడు ధీరజ్. వాడి బుల్లి అరచేతిలో వరి వడ్లు ఉన్నాయి.
నవ్వి తలూపాను నేను. వచ్చి నా పక్కన కూర్చున్నాడు.
నేను ఎండు మిరపకాయల తొడిమలు తీస్తుంటే వాడూ కాయలు పట్టుకోబోయాడు. చేతులు మండుతాయని వారించాను. ననే్న చూస్తూ.. ‘ఇవేంటి?’ అనడిగాడు.
‘మిరపకాయలు’ చెప్పాను. వాడూ చిన్ని మొక్కలా అమాయకంగా కనిపించాడు నా కళ్లకి.
‘ఇవీ మొక్కలొస్తాయా?..’ అన్నాడు కుతూహలంగా.
ఒలిచిన కాయల్లోంచి రాలి కిందపడ్డ మిరప గింజల్ని తీసి, వాడి చేతిలో వేస్తూ, ‘వీటిని.. అదుగో అక్కడ నేలలో పాతి పెట్టిరా..’ అన్నాను. నేను చూపించిన వైపు పరుగున వెళ్లాడు ధీరజ్. ఆ నేలలో చూపుడు వేలిని దించి, అందులో గింజల్ని వేసేసి మట్టిని కప్పేశాడు. ఉత్సాహంతో వాడాపని చేస్తుంటే వాడినే చూడసాగాను.
రివ్వున వెనక్కొచ్చి, ‘అమ్మా...! మొక్కలెప్పుడొస్తాయ్...’ అన్నాడు తొందరగా వాటిని చూడాలన్నట్టు.
‘రోజూ అక్కడకెళ్లి.. వచ్చాయో లేదో చూస్తూండు’ అన్నాను నవ్వుతూ.
* * *
* * *
* * *
* * *
* * *

nata story -  matti manishi - andhrabhoomi story

13 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి said...

గీతిక గారు,
చక్కటి అంశం,చక్కని కథనం.శైలి ఆకట్టుకుంది.అభినందనలు.

మాలా కుమార్ said...

అభినందనలు గీతిక గారు .
కథ భారం గా మనసును కదిలించింది .

గీతిక బి said...

c ఉమాదేవి:
ధన్యవాదాలు ఉమాదేవి గారూ. ఈ కథల బహుమతి ప్రదానం నిన్నసాయంత్రం జరిగింది. అక్కడ మీరు ఉన్నారా...?

గీతిక బి said...

మాలా కుమార్:

ధన్యవాదాలు మాలా కుమార్ గారూ.

bhagavandas said...

hi akka chalarojulu rojula taruvatha manchi katha chadivanu akka. ee katha aina entho kontha avagahanatho rastaremo meeru. chala baga vivaranga rasaru katharupam lo. pesticides gurinchi eppativallaku anthaga teliyadu pramadam/pranathakam ani, virugudu kuda teliyani paristithi. monna satyamev jayate national programme lo kuda pesticide gurichi vivaranga discuss chesaru. pantaku, manaku chalavaraku vishapuritham ani. solutionga organic forming gurinchi chepparu. vyavasam lo marpulanu, kotta kotta paddathulanu formarsku training kuda estunnaru hyderabad lo. kaani konthamandi matrame telusukuntunnaru andariki vyavasaya vignanam andali.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

అభినందనలు గీతికా .
కథ భాద గా అనిపించినా మనసును కదిలించింది.
అలాగే అడ్వాన్సు గా కూడా అభినందనలు.నీ కద స్వాతి స్వపరివార పత్రికలో ఎంపిక అయినందుకు.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

అభినందనలు గీతికా .
కథ భాద గా అనిపించినా మనసును కదిలించింది.
అలాగే అడ్వాన్సు గా కూడా అభినందనలు.నీ కద స్వాతి స్వపరివార పత్రికలో ఎంపిక అయినందుకు.

Lasya Ramakrishna said...

అభినందనలు గీతిక గారు.

Lasya Ramakrishna said...

అభినందనలు గీతిక గారు.

సుభ/subha said...

గీతిక గారూ ఈ రోజు స్వాతిలో చూసాను.. అది మీరేనేమో అనే సందేహంతో ఇక్కడ కామెంటుతున్నాను. మీకు యెలా తెలియజేప్పాలో తెలియక.. బహుమతి పొందిన కథలలో మీది కూడా ఉంది కదా? ఆ గీతికి.బి మీరే కదా? ఒకవేళ అది కరెక్టే ఐతే నా హృదయపూర్వక శుభాకాంక్షలండీ మీకు. కథ ఎప్పుడు ప్రచురిస్తారా అని నీరీక్షిస్తున్నాను..
సుభ

గీతిక బి said...

@ పూర్వ ఫల్గుణి:

మట్టిమనిషి కథ మిమ్మల్ని కదిలించినందుకు, మీ అభినందనలకు ధన్యవాదాలు మణిగారూ. మీ అడ్వాన్స్ అభినందలకు కూడానండీ...

@ లాస్య రామకృష్ణ:

Thank you Lasya garu.

@శుభ హాసిని:

ఆ ఎంపికైన కథ నాదేనండీ. మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు Subha garu.

Lakshmi Raghava said...

kathamsam చాల బాగుంది .చదివి చాల రోజులే అయ్యింది నేనెందుకు కామెంటు ఇవ్వలేదో గుర్తు రావటం లేదు. ఇప్పుడు మరోకథకు కూడా అభినందనలు

గీతిక బి said...

@Bhagavan das:
Thank you so much Bhagavan das..


@లక్ష్మి:
ధన్యవాదాలు లక్ష్మి గారూ..