18.4.12

హైదరాబాద్‌లోని జాగృతి భవనంలో...

రాత్రి ఏ వేళప్పుడో నిశ్శబ్దంగా...
మల్లెలు విచ్చుకున్నంత మెల్లగా...
మంచు కురిసెళ్ళిపోయినంత మామూలుగా...
జరిగిపోయింది ఆ సమావేశం.

అందరూ తలపండిన పెద్దలే.
ప్రతి పలుకూ వారి అనుభవాల్లోంచి జారినదే.
వారందరి సమక్షంలో చాలా ఆహ్లాదంగా
గడిచింది ఆ సాయంత్రం.

సమాజాన్ని,యువతరాన్ని దిశానిర్దేశనం చేయగల పత్రికల జాబితాలో జాగృతి వారపత్రిక ముందు పేర్కొనదగింది. కమర్షియల్‌గా మాత్రమే ఉంటున్న ఈ రోజుల్లో ఇంత సాంప్రదాయవాదంగా, నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడుండడమే కాకుండా... అదే దైవంగా పనిచేస్తున్న "జాగృతి" పెద్దలకి నా హృదయపూర్వక అభినందనలు.


కీర్తిశేషులు శ్రీ వాకాటి పాండురంగరావుగారి స్మారక కథా పురస్కారాల్లో మొదటి బహుమతి పొందిన నా కథ "సహజీవనం"కి గాను బహుమతి ప్రదానం 08-04-2012 ఆదివారం సాయంత్రం కాచిగూడలోని జాగృతి భవనంలో జరిగింది. ఆ సభకి ముఖ్య అతిథిగా డా. శరత్ జ్యోత్సారాణి గారు వచ్చారు. ఇంకా జి.బి. రెడ్డి గారు, శేషగిరి రావు గారు, హరిహర శర్మ గారు, మునిపల్లె రాజు గారు,... మొదలైన వారు కీ.శే. శ్రీ వాకాటిగారితో తమ తమ అనుభవాల్ని సభికులతో పంచుకున్నారు.

అతిథిగా విచ్చేసిన శ్రీమతి శరత్ జ్యోత్సారాణి గారి వాక్ధాటి అద్భుతంగా ఉంది.

చాలా ఆశ్చర్యం కలిగించిందేంటంటే... మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుండి మేం వచ్చేసే వరకూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూనే ఆ సభలోని వ్యవహారాలన్నీ (పేరుని సార్థకం చేస్తున్నట్టుగా) తానే స్వయంగా చూ(చే)సుకున్న జాగృతి ఎడిటర్ విజయసారధి గారు.అంత వయసులోనూ ఆయనలోని జ్ఞాపకశక్తిని మేం ఇప్పటికీ తల్చుకుంటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా.. అదీ హైదరాబాదులో ఆయన పంచె కట్టు మాత్రమే ధరిస్తారని తెలిసి ఈ రోజుల్లో ఇంకా ఆ ధారణ మిగిలుందా అనిపించింది.


ఇంకా...శ్రీ వాకాటి పాండురంగ రావు గారి అమ్మాయి అపరాజిత గారితో మాట్లాడ్డం...; సేవా భారతి స్థాపించి వైద్య పరంగా ఎందరికో సేవ చేస్తున్న డా.సురేంద్ర రెడ్డిగారు, నీరజా దేవి గారు, రచయిత శ్రీ వి.రాజా రామమోహన రావు గారులతో పరిచయం..; అరిపిరాల సువర్ణ గారితో సంభాషణ; ఇంకా... అందరికీ అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలు...; అన్నీ కొత్త అనుభూతులే. మొత్తం మీద అది బహుమతి ప్రదాన సభలా కాక.. ఇంట్లోనే జరిగిన వేడుకలా అనిపించింది.


jagruti / vakati / vakaati pandu ranga rao / jaagruthi weekly


7 వ్యాఖ్యలు:

రామ్ said...

Congratulations గీతిక gaaru.

గీతిక బి said...

@ రామ్ గారు:

ధన్యవాదాలండీ...

bhagavandas said...

Congratulations Geethakka. nee Blog post kosam chalarojula nunchi wait chestunna.

గీతిక బి said...

Thank you Bhagavan Das...

నందు said...

nenu miss ayyanu ee sari... kalavatam kudaraledu

Anonymous said...

Congratulations Geethika gaaru:)

గీతిక బి said...

Thank you Mahi garu..