11.2.11

విదేశాల్లో ఉండే తెలుగువారి కోసం...16వ తెలుగు ఉగాది ఉత్తమ రచనల పోటీ

వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ పోటీ విదేశాల్లో ఉండే తెలుగువారి కోసం...

వివరాలకై ఈ లింక్‌ క్లిక్ చేయండి.



1. Vanguri Foundation of America is pleased to announce the 16th Ugadi Contest for Creative Writing in Telugu as follows, also attached. Please visit www.vangurifoundation.blogspot.com for more details on our literary activities since 1994. The last date to receive entries is March 4, 2011, about four weeks from today.

2. This contest is open for all Telugu writers living in any country outside India. Please promote the event by sending this to those who may be interested.

3. We apologize if you receive this message multiple times.

అఆఇఈఉఊఋౠఎఏఐఒఓఔఅంఅ:
కఖగఘఙచఛజఝఞటఠడఢణతథదధనపపబభమయరలవశషసహహళక్షఱ


16వ తెలుగు ఉగాది ఉత్తమ రచనల పోటీ

(రచనలు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 4, 2011)
(ఫలితాలు ప్రకటించే తేదీ: ఏప్రిల్ 4, 2011 (ఉగాది)

గత 15 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది ((ఏప్రిల్ 4, 2011) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 16వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. విదేశాలలో తెలుగు భాషనీ, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహించబడుతున్న ఈ పోటీలలో ఉత్తర అమెరికాలోనూ,మాతృభూమిని వదలి ఇతర దేశాలలో నివసిస్తున్న విదేశాంధ్ర రచయితలందరినీ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం. విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇవ్వబడతాయి.

ఉత్తమ కథానిక:
(రెండు బహుమతులు) ఒక్కొక్కటీ: $116

ఉత్తమ కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116

నా మొట్ట మొదటి కథ:
(రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116

నా మొట్ట మొదటి కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116

ఈ సంవత్సర ప్రత్యేకం "నా మొట్ట మొదటి కథ",
"నా మొట్టమొదటి కవిత"

గత సంవత్సరం జరిగిన 15వ ఉగాది పోటీలో ప్రవేశపెట్టిన "నా మొట్టమొదటి కథ" ప్రక్రియకి మంచి స్పందన వచ్చింది. ఆ స్పూర్తితో ఈ సంవత్సరం కూడా ఆ ప్రక్రియలో పోటీని కొనసాగిస్తూ, "నా మొట్టమొదటి కవిత" అనే నూతన ప్రక్రియలో కూడా పోటీలు నిర్వహిస్తున్నాం. ఆధునిక కవిత, ఛందోబధ్ధమైన కవితలూ, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే. కథలూ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తమ మొట్టమొదటి రచనగా పేర్కొంటూ, నూతన రచయితలందరినీ ఈ రెండు ప్రక్రియలలోనూ తమ అముద్రిత స్వీయ రచనలని పంపించమని కోరుతున్నాం. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులనూ, కవులనూ, కవయిత్రులనూ ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు:
· ఇది వరకటి 15 పోటీల వలే కాకుండా, ఈ సారి ఉగాది తేదీకి నెల రోజుల ముందే మీ రచనలు పంపించాలి.
· అన్ని రచనలూ మాకు చేరవలసిన ఆఖరి రోజు మార్చ్ 4, 2011.
· ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చును. వ్రాత ప్రతిలో పదిహేను పేజీల లోపు ఉంటే బావుంటుంది.
· తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
· విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు.
· బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది అంతర్జాల పత్రికలోనూ, "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, వారి నిర్ణయానుగుణంగానూ ప్రచురించబడతాయి.
· ఫలితాలు ఉగాది పర్వదినాన (ఏప్రిల్ 4, 2011) కానీ అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఈ లోపుగా తమ ఎంట్రీలను ఇంకెక్కడా ప్రచురించవద్దని రచయితలను కోరుతున్నాం.
· విజేతల ఎన్నిక లోనూ, ఇతర విషయాలలోనూ నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries: MARCH 4, 2011

Address to send entries
Preferred Method:
Electronic Soft copies by e-mail (PDF, JPEG or Gautami/Unicode Telugu fonts)
rvanguri@wt.net, and copy to phspvr@physics.emory.edu

By Fax: 1866 222 5301
By Postal/Snail Mail:
Vanguri Foundation of America
P.O. Box 1948
Stafford, TX 77497

For any additional details, please contact

Chitten Raju Vanguri
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@yahoo.com


OR

Pemmaraju Venugopala Rao
Phone: 404 727 4297
E-mail: phspvr@physics.emory.edu

2 వ్యాఖ్యలు:

bhagavandas said...

Akka aa link and aa blog kuda open avadam ledu...so u modify this post. may be its useful for someone.

గీతిక బి said...

పోస్ట్ లోని లింక్ నాకు బాగానే ఓపెన్ అవుతుంది భగవాన్. అయినా పోటీ వివరాలు మొత్తం ఇస్తున్నాను...

చెప్పినందుకు థ్యాంక్యూ.