11.2.11

కాలువల్నిండా అంతర్వేది తీర్థం హడావుడే...

ఈ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉండే అంతర్వేది తీర్థంకోసం అప్పుడే హడావుడి మొదలైపోయింది. నర్సాపురం రేవు నుంచి అంతర్వేదికి గోదారిలో జనాల్ని తీసుకెళ్ళడం కోసం లాంచీలు, పంట్లు నర్సాపురం రేవుకి ప్రయాణమవుతున్నాయి. అదికూడా ఎక్కడెక్కడి దూరాల్నుంచో చిన్ని చిన్ని కాలువల మీదుగా...

కాలువ గేటు దగ్గర పడవల ట్రాఫిక్...

చిన్ని కాలువలో పెద్ద లాంచీ...

గేటు దాటించడం కోసం కుస్తీలు....

పట్టర పట్టూ హైలెస్సా... గట్టిగ లాగూ హైలెస్సా...

9 వ్యాఖ్యలు:

శివ said...

తెలియని విషయం గురించిన ఫోటోలు. బాగున్నాయి. థాంక్యూ

స్వామి ( కేశవ ) said...

ఈ ఫోటోలు మీరు ఎక్కడ తీసారోగానీ, నేను మొన్న పెనుగొండ కాలేజీ దగ్గర సేమ్ చూసాను ..
ఓ పది, పదకొండు లాంచీలు, పడవలు అక్కడ గేటు దగ్గర ఆగి ఉన్నాయి ..

ఇక అంతర్వేది తీర్ధం అంటారా , స్పెషల్ దర్శనం లో నాలుగు గంటలు లైన్లో నిలబడితే , అరనిమిషం కూడా దర్శనం చేసుకోనివ్వలేదు .. :((

geetika said...

చదివాక విషయం ఏమైనా తెలిసిందా శివ గారూ.
Thank you Siva garu...

geetika said...

ఈ ఫొటోల్లో కొన్ని మా ఇంటి దగ్గరవి, మరికొన్ని పాలకొల్లు లాకుల దగ్గర తీసినవి.

ఈ తీర్థం అయిపోయేవరకూ ఇలా లాకులు ఉన్న చోట ఇలాగే పడవల ట్రాఫిక్ ఉంటుంది. గేట్లు మొత్తం తీసేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కదా.

అందుకని ఎక్కువ పడవలు ఉన్నప్పుడు ఒక లాకు దగ్గర రెండు పడవల్ని పంపి వెంటనే గేటు మూసి మిగిలిన వాటిని ఆపేసి, రెండో లాకు తెరిచి పడవల్ని రెండో లాకు దాటిస్తారు. తరువాత రెండో లాకు మూసేసి మొదటి లాకు గేటు తెరుస్తారు. మళ్ళీ రెండు పడవలు... ఇలా పడవలు వెళ్ళేసరికి రాత్రైనా పగలైనా ఇంతే... ...

ఏమైనా అర్థమైందా కేశవ గారూ..?

geetika said...

ఇంతకీ అంతర్వేది తీర్థం ఎలా ఉందండీ...?

స్వామి ( కేశవ ) said...

మీరు మరీ అలా అడగటం ఏమీ బాలేదండి ..
ఎలా ఉంటుందో , ఎలా ఉందో మరీ స్పెషల్ గా చెప్పాలా ?, సింప్లీ సూపర్ :))

స్వామి ( కేశవ ) said...

హా , బాగా అర్ధమయ్యిందండి ..

ఇందు said...

మీ బ్లాగ్ ఇదే చూడటం.కానీ మీ పోస్ట్లు చాలా బాగున్నాయ్! అందరిలా కాకుండా లైవ్లీ గా ఉన్నాయ్! రాధికా(నాని) అని 'సత్యప్రియా' అనే బ్లాగ్ వ్రాస్తుంటారు.తనూ మీలాగే తెలియని ఇలాంటి భలెభలే విషయాలు వ్రాస్తారు :) నాకు బాగా నచ్చింది మీ బ్లాగ్ :)

geetika said...

Thank you so much Indu garu...