25.10.10

పసర పామును చూశారా ఎప్పుడైనా...

మా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు మీద నిన్న సాయంత్రం కనిపించిందీ పసర పాము.
నల్ల వృత్తంలో ఉన్నది దాని తల.

చెట్ల మీద ఉండే ఈ పసర పాము ఆకుల్లో కలిసిపోయేలా పచ్చగా ఉంటుంది.
ఇది చాలా ప్రమాదకరమట...

దాని తల నోటి దగ్గరకు వచ్చేసరికి సూదిగా, మొనదేలిన ఈటెలా ఉంది.
ఇది అన్నిపాముల్లా ఒంటి మీద కాటు వెయ్యకుండా నెత్తిమీద పొడుస్తుందంటారు.

మనిషి కూడా చనిపోతాడట.
మరి ఎంత వరకు నిజమో...!

19 వ్యాఖ్యలు:

చెప్పాలంటే...... said...

ఈ పసర పాముల గురించి నేను విన్నాను. మేము విజయనగరంలో వున్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటపుడు చెట్ల మీద వుంది నెట్టి మీద పొడుస్తాయని చెప్పేవాళ్ళు సైకిలు తొక్కుతూ కుడా ఆ చెట్ల దగ్గరకి వచ్చేసరికి పైకి చూసేదాన్ని అప్పట్లో భయం వేసి.... -:)

గీతిక బి said...

నేనూ వినడమైతే చాలా సార్లు విన్నాను గానీ... చూడ్డం మాత్రం ఇదే మొదటిసారి. చిగురాకు రంగులో చాలా పచ్చగా మెరుస్తూ ఉంది.

Anonymous said...

పసరు పాములను చూడటమే కాదు, చంపిన పాపిని. :(( అది క్రిమికీటకాలను, బల్లులను, తొండలను తినే విషములేని అందమైన ఓ సర్పము. చెట్ల మీద, గడ్డిలో డేగల కంట పడకుండా వుండేందుకు ప్రకృతి దానికి పచ్చరంగు దేహాన్నిచ్చింది. జెర్రిపోతు(రాట్ స్నేక్) లాగే రైతులకు మిత్రుడు. హింసిస్తే నోరుతెరచి కరవడానికి ప్రయత్నిస్తుంది, కొద్దిగా గాట్లు పడతాయేమో.

మంచు said...

యా.. నేను చాలా సార్లు చూసాను... ఈ పాము మిగతా పాముల్లా నేల మీద కాకుండా ఎత్తులొ (చెట్ల మీద) ఉంటాయి కదా ... అందుకు మన తల వాటికి అందుతుంది... అంటే మనం సరిగ్గా వెళ్ళి ఆ చెట్టుకుంద నుంచుటాం కాబట్టి మన తల , భుజం మీద కాటు వెసే అవకాసం ఉంటుంది. అవును ఇవీ త్రాచుల్లా విషపూరితమయినవే...

Anonymous said...

Ahaetulla venom is not considered to be dangerous to humans

Anonymous said...

http://en.wikipedia.org/wiki/Ahaetulla_nasuta

The venom is mild and causes swelling. Symptoms will subside within three days.

There is a widespread myth in parts of southern India, that the species uses its pointed head to blind its human victims.

కౌటిల్య said...

మంచి ఫొటోలు పెట్టారు...మా చిన్నప్పుడు పొలాల్లో,ఇంట్లో కూరపాదుల్లో కనీసం రోజుకి ఒకటన్నా కనిపించేది...ఇది పూర్తిగా non poisonous snake...ita scientific name is dryophis...తెలుగులో పసిరికపాము అంటారు.. దాని defense కోసం తల మీద గట్టిగా పొడుస్తుంది...దానివల్ల ఏమీ ప్రమాదం లేదు....భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు...

ఆ.సౌమ్య said...

మా విజయనగరంలో నేను బోల్డు సార్లు చూసాను, పసిరిక పాములు అంటాం. పచ్చగా, సన్నగా ఉంటాయి. ఎన్నోసార్లు అది పామో, లేక ఏ తీగో అనుకుని తికమకపడేవాళ్ళం. మా పాత ఇంట్లో పెద్ద పెరడుండేది. అక్కడ జామ, నారింజ చెట్లు, చిక్కుడుపాదు, ఆనపపాదు, మల్లెపందిరి ఇలా బోల్డు ఉండేవి. ఆ పాదుల మీద ఎన్నోసార్లు కనిపించేవి. కొంచం అదిలిస్తే గబగబా పాకి వెనుక గోడమీదనుండి మాయమయిపోయేవి. ఆ పాదుల దగ్గరకి వెళ్ళాలంటే మాకు ఎప్పుడూ భయంగా ఉండేది. అది తీగో, పామో అని పదిసార్లు చూసుకుంటూ ఆ మొక్కలకి సేవలు చేసేవాళ్ళం. అయితే ఎప్పుడూ ఎవరినీ కరిచినపాపాన పోలేదు.

A K Sastry said...

మొదటి 'అనోన్' తో యేకీభవిస్తాన్నేను. నేనూ ఒకటి చంపాను--తరవాత వాటి గురించి తెలుసుకొన్నప్పుడు విచారించాను!

వేయిపడగల్లో "పసిరిక" లాంటివి ఈ పసిరిక పాములు.

గీతిక బి said...

థ్యాంక్యూ ఎనానిమస్.... లింక్ ఇచ్చినందుకు.

గీతిక బి said...

మంచు గారూ...

మొన్న ఇక్కడ పసరికని చూసినప్పుడు అది విషపూరితమని చాలా మంది భయపడ్డారు. కానీ దాని కాటు వల్ల చనిపోవడం అన్నది వినలేదట ఎవరూ. ఏదేమైనా... తలమీద పొడిచే పామంటే భయపడాల్సిందే కదా.

గీతిక బి said...

Thank you for your comment KouTilya garu...

గీతిక బి said...

సౌమ్య గారూ...

మీ ఇంట్లో అన్ని చెట్లు ఉండేవా...!

నిజంగా... పల్లెటూర్లు, పెరళ్ళు, అక్కడి మంచి మనసులు, పొలాలు, కాలువలు... ఆ వాతావరణం చాలా బాగుంటుంది కదండీ.

మొత్తానికి పసర పాము కరవగా చనిపోవడం వినలేదన్నమాట ఎవరూ... (నాకు చెప్పిన వాళ్ళలో)

గీతిక బి said...

Thank you for your comment KrishnaSree garu.

గీతిక బి said...

పసిరికల గురించి మీకు తెలిసినదాన్ని నాతో పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు. ఇక నుంచి పసర పాములు కనిపిస్తే జాగ్రత్తగా ఉంటాను, భయపడను.

Anonymous said...

ఈ పాములు విషమైనవి కావు చిన్నప్పుడు చాలా పట్టె వాళ్ళం ఆడుకునే వాళ్ళం....ఇప్పటికి పల్లెటూర్లలో పిల్లలు వీటితో ఆడుకునే దృశ్యాలు మనం చూడచ్చు. సామాన్యంగా కరవవు...విషపూరితం ఎందుకు కావంటే, వారికి రెండు వరుసల్లొ చిన్న దంతాలు వుంటాయి...కరిచినా తీవ్రమైన నొప్పి , ఎలర్జి వస్సుంది కాని చనిపోరు....దంతాలు చర్మం లోపలికి కూడా దిగిపోవు. ఇతర పాములకి ఇవంటే భయమని చెబుతారు, ఇవి వాటి పడగలని దూసుకుపోయే వేగంతో చీల్చి వెస్తాయి అని అంటారు....కాని అలాంటి దాఖలాలెక్కడా ఎరుగము.

గీతిక బి said...

హమ్మయ్య. బోల్డంత ధైర్యం ఇచ్చే విషయాలు చెప్పారు. థ్యాంక్యూ అనానిమస్ గారు.

రాధిక(నాని ) said...

నేనూ పసర పాము చాలా సార్లు చూసాను.
అన్నట్టు గీతిక గారు ..మీరు మాకు చాలా దగ్గరలోనే ఉన్నారు.అంటే మనిద్దరిదీ ఒకే జిల్లా:))

గీతిక బి said...

థ్యాంక్యూ రాధిక గారూ.

జిల్లా ఒకటే. కానీ గాంధీనగరమెక్కడో అర్థం కాలేదు నాకు...