12.10.10

బహుమతి పొందిన నా కథ... "ధర్మ సమ్మూఢ చేతా పృచ్ఛామి..."

రచయిత్రుల కథల పోటీలో బహుమతి పొందిన నా కథ... 10 అక్టోబరు 2010 నాటి ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో అచ్చయ్యింది.
అది మీ కోసం ఇక్కడ...

ధర్మ సమ్మూఢ చేతా:పృచ్ఛామి


మంచు తుంపరల్లా మొదలైన చినుకులు క్రమేపీ పెద్దవవుతూ లయతో కూడిన శబ్దం చేస్తున్నాయి. దారి ప్రక్కలనున్న మట్టిలోంచి సన్నటి నీటిపాయ ఉరకలేస్తూ ముందుకు పారుతోంది. అదో గమ్యం తెలీని ప్రయాణం... పల్లాన్ని వెతుక్కుంటూ.

వాలుగా పడుతున్న చిరు చినుకులు అప్పుడొకటి అప్పుడొకటి వచ్చి బాల్కనీలో కూర్చున్న నన్నూ తడుపుతున్నాయి. వాటికి తోడుగా రివ్వున గాలి. కానీ ఇవేవీ నా ఆలోచనల్ని ఆపలేకపోతున్నాయి.

జడ్జిగా ఉన్న నా ఇన్నేళ్ల సర్వీసులో ఇలాంటి కేసుని నేనెప్పుడూ చూడలేదు. నాకే కాదు...ఎవరికీ ఇలాంటి కేసు అనుభవంలోకి వచ్చి వుండదు. సంకట స్థితి అన్న మాటకర్థం ఇప్పుడు బాగా తెలుస్తోంది నాకు.

ఎవరయినా నష్టపోయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు, మోసపోయినప్పుడు, ఇలా వివిధ కారణాల్తో కోర్టుకు వస్తారు. కానీ ఇలాంటి విషయంలో కూడా న్యాయం కోసం కోర్టుకి వస్తారా...? అదీ ఒక జంతువు మీద...!

కింది కోర్టుల్లోలాగానే జంతువుమీద కేసేంటని నేనూ కేసును కొట్టివేసేదాన్నే. కానీ అతను పిటీషన్లో పేర్కొన్న కారణం నన్ను ఆలోచింపజేసింది. ఆ పిటీషన్లో అతను చెప్పిన కారణం...

మేం కోర్టుకు ఎందుకు వస్తాం...? న్యాయం జరగాలనే కదా. ఇక్కడ న్యాయం అంటే ఏంటి.. నా తరఫు మనిషిని ఎవరో చంపారు లేదూ రేప్‌ చేశారు. దానికి మీరిచ్చే న్యాయంవల్ల చనిపోయిన వాళ్లు లేచొస్తారా? రేప్‌ కాబడ్డ వాళ్ల శీలం తిరిగొస్తుందా...? అవేవీ రావు. మీరు వాళ్లకి వేసే శిక్షను బట్టి మా మనసుకు తృప్తి కలుగుతుంది. మరి నా మనసుకి ఎలా తృప్తి కలుగుతుంది...? నేను దాన్ని చంపితే న్యాయపరంగా తప్పు. మరి మీరూ శిక్ష వేయక, నేనూ శిక్షించక...కన్న బిడ్డను పోగొట్టుకున్న నా మనసు శాంతించేదెలా...?'

ఇవీ...ఆ పిటీషన్లోని వాక్యాలు

vanguri - kathalu- andhra prabha

14 వ్యాఖ్యలు:

అశోక్ పాపాయి said...

congrats andi.

కొత్త పాళీ said...

Interesting

మనసు పలికే said...

గీతిక గారు, ముందుగా మీ కథ బహుమతి పొందినందుకు అభినందనలు. చాలా బాగుందండీ మీ కథ.. నాకైతే కొత్తగా అనిపించింది మీ ఆలోచన.

geetika said...

థ్యాంక్యూ అశోక్ పాపాయి గారు.

geetika said...

నిజమా కొత్తపాళీ గారూ. థ్యాంక్యూ సో మచ్.

geetika said...

అపర్ణగారూ... థ్యాంక్యూ.

కొన్ని చూసినప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన రాష్ట్రంలో ఏనుగులు చేసిన ధ్వంసం నన్ను చాలా కలచివేసింది. బహుశ ఈ కథ వ్రాయడానికి కారణం ఆ బాధేనేమో.

శివరంజని said...

congrats గీతిక గారు,

geetika said...

thank you Sivaranjani...

bhagavandas said...

హాయ్ అక్క బాగున్నావా? అక్టోబర్ 10 వ తేది "ధర్మ సమ్మూడ చేత ప్రుచ్చామి" చదివాను చాలా బాగుంది. ధర్మ విచక్షణ చేయలేఖ అడుగుతున్నాను అని చివరన టైటిల్ కు అర్థం ఇచ్చినందుకు ఆంధ్ర ప్రభ సంపాదకులకు ధన్యవాదములు. కథ పూర్తిగా చదివినప్పుడు ప్రస్తుత సమాజం గుర్తుకు వచ్చింది. మగ ఉన్మాదులు పైశాసికంగా ప్రేమ కోసం మని , ప్రేమించలేదని, కోరిక తిర్చలేదని, జంతువు లా దాడి చేసి, ఏమి పట్టనట్టు జైలు లో మానసిక రోగి లా నాటకం ఆడుతూ, తప్పించుకుంటున్నారు(చిన్న పిల్లల కిడ్నాప్ చేసి చంపడం, వయసులో ఉన్న అమ్మాయిలను ప్రేమించలేదని, కోరిక తిర్చలేదని, అన్యాయం గా , అమానుషంగా చంపడం... ఇలా ఎన్నో ....). మనుషులు మనుషుల ను దాడి చేస్తే, న్యాయం జరగటం లేదు ప్రస్తుతం. అలాంటిది జంతువు మనుషుల మీద దాడి చేస్తే న్యాయం జరగుతుందని ఆశ లేదు. "ధర్మ సమ్మూడ చేత ప్రుచ్చామి" కథానిక నిజంగా చాలాబాగా ఉంది కాని ఆ పాపకు చందన గారు నిజంగా సరైన న్యాయం చేయలేకపోయారేమో అనే బాధ గా ఉంది. చివరగా కథ కొత్తగా ఆలోచింప చేసేలా ఉంది. మంచి కథ రాసినదుకు హృదయ పూర్వక అభినందనలు అక్క.

geetika said...

Thank you Bhagavan Das.
Kadha gurimchi baagaa aalochinchinaTlunnaav....

Mantha Bhanumathi said...

గీతికగారు,
మీ కథ చాలా చాలా బాగుంది.
తీసుకున్న వస్తువు, చెప్పిన తీరు కొత్తగా ఉన్నాయి. అందుకోండి నా హృదయపూర్వక అభినందనలు.
చాలా ఊర్లలో ఊరకుక్కల బెడద కూడా ఎక్కువగానే ఉంది. తెల్లవారు ఝామున బస్సుదిగి వెళ్తుంటే వాటి అరుపులకే గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది.
నా కయితే జడ్జ్ వేసిన శిక్ష బాగుందని పించింది. అంతకన్నా ఏమీ చెయ్యలేదు మరి.. అడవిలో తోటి క్రూర జంతువుల మధ్య బ్రతుకు పోరాటం సాగించడం ఏమంత సులభం కాదు.. అదీ జనావాసంలో భయపడే మనుషుల మధ్య బ్రతికిన పొగరుబోతు ఆంబోతుకి.
కొత్త సబ్జెక్ట్, కొత్త తీర్పు.. మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్.
మంథా భానుమతి.

geetika said...

ప్రోత్సాహాన్నిచ్చే ఇలాంటి అభినందనలు మీ నుంచి అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ భానుమతి గారూ.

తువ్వాయి said...

గీతిక గారు !మీరు రాసిన ప్రతీ కథ..ఉవ్వెత్తున ఎగసే ఓ భావోద్వేగపు కెరటం !
హృదయానికి హత్తుకునేలా ఉన్నాయండీ ..మీ రచనలు .
మీ కథ"ధర్మ సమ్మూఢ చేతాః పృచ్చామి" మొన్న అంధ్ర ప్రభ లో చదివి ఆ పేపర్ కటింగ్ దాచిపెట్టుకున్నాను .మీ బ్లాగు చూసేవరకు ..ఆ గీతిక గారే ..ఈ గీతిక గారు అని నిజ్జం గా తెలియదు .

geetika said...

థ్యాంక్యూ తువ్వాయి గారూ...