6.2.12

ఒక తారక...


మనమందరం జీవితాన్ని చాలా సాదాసీదాగా గడిపేస్తుంటాం.
చిన్నప్పుడు చదువుల్తోనో; యవ్వనంలో వేరెవరి ఆలోచనల్లోనో; ఆ తర్వాత పెళ్ళీ, బాధ్యతల మధ్యో... మన జీవితంలోని రోజులు మనకే తెలియకుండా మన చేతుల్లోంచి జారిపోతుంటాయి. ఆ జారిపోయే రోజులన్నింట్లోనూ మనం ఆలోచించేదీ, కావాలనుకుని తాపత్రయపడేదీ మన స్వార్థం కోసమే.
కానీ... ఏ మూలో తళుక్కున మెరిసే తారలా అక్కడక్కడ కొన్ని మనస్తత్వాలు... మన ప్రమేయం లేకుండానే మన చూపుల్ని తమవైపు తిప్పుకునేలా చేస్తాయి. సున్నితత్వంతో మనలోపలి ఆలోచనల్ని తట్టి లేపుతాయి.
నిజమే... ఆకర్షించగలిగేది కనులకి కనిపించే అందమే కాదు మనసుని హత్తుకునే సౌందర్యం కూడా..! అందం యొక్క ఆయువు అల్పమైతే... మానసిక సౌందర్యంలోని ఆనందం అనంతమైనది.

అలాంటి సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఓ తారకే సాయిపద్మ.
"శరీరపరమైన అవకరం కంటే అత్యంత జాలిపడాల్సిన విషయం మనసుకుండే అవకరమే.." అనిపించింది నాకు ఆమె గురించి తెలుసుకున్నాక.

సాయిపద్మ చేస్తున్న సామాజిక సేవ గురించి ఆంధ్రభూమి మాసపత్రికలో వచ్చిన వ్యాసం... ఈ క్రింద ఉంది. చదివి మెచ్చితే అభినందించండి. మనసు కరిగితే చేయూతనందించండి.


Tv interviews:

part 1 sakshi salam-

part two sakshi salam

**********************************

Please see the links of HM TV interview below....

Part One:

Part Two:



సామాజిక సేవ చేస్తున్నవారిని గుర్తించి అంకితభావంతో నలుగురికీ తెలుపుతున్న శ్రీదేవీ మురళీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.






sai padma - Ability In Disability - AID

2 వ్యాఖ్యలు:

కమనీయం said...

మనం అప్పుడప్పుడు కొన్ని దానధర్మాలు చేసి సంతృప్తి పడతాం.అంతకన్నా ఏమీ చెయ్యలేము.మీరు రాసిన వ్యక్తే గాక ,ఇంకా బీదవారూ,వికలాంగులూ ఎన్నో కష్టాలతో ,అవరోధాలతో ,గొప్ప సేవకార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు,పత్రికలలో చదివి ఆశ్చర్యపోతాము.మనం చెయ్యలేకపోయినా ,కనీసం అలాటివారికి సహాయసహ కారాలని అందించాలని అంగీకరిస్తాను.

గీతిక బి said...

నిజమే. ధన్యవాదాలండీ..