31.7.11

తనవెంటే...

ప్రతి రోజూ, ప్రతి క్షణం తనతోనే... తన వెంటే ఉండీ... అనుకోకుండా ఎడబాటు ఎదురైతే...?

ఇద్దరి మనుష్యుల మధ్య బంధమనేది ఖచ్చితంగా వారు కలిసి గడిపే సమయం మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరితో దగ్గరగా ఉంటే వారితో అవినాభావ బంధం... కనీసం అస్పష్టమైన ఇష్టం.. ఏర్పడతాయి. ఈ రోజుల్లో భర్త / భార్య సహచర్యంలో కంటే సహోద్యోగుల మధ్యనే ఎక్కువ సమయం గడిచిపోతుండడం దురదృష్టకరం. ఎవరితో దగ్గరగా ఉంటామో వాళ్ళతో రిలేషన్ బలపడుతుందనడంలో సందేహం లేదు. ఇది అప్పటికప్పుడు బయటికి వ్యక్తం కాకపోయినా, చూసుకోగలిగితే మనకే కనిపిస్తుంది.. మనసులోతుల్లో.

మానసికంగా కంటే భౌతికంగా ఏకమై అద్వితీయమైన ఆనందాన్ని పొందే భార్యాభర్తల కంటే ముది వయసులో కోరికల జడి ఎండిపోయిన వృద్ధజంటలోనే అతీతమైన బంధం ఉండడానికి కారణం...?



వయసులో ఉన్నప్పుడు తనే మన జీవితం కాదు. మనకంటూ కొన్ని వ్యాపకాలు, బంధాలు, బాధ్యతలు ఉంటాయి. ఒక్కోసారి తన కంటే అవే ప్రాధాన్యం మనకి. కానీ ముదిమిలో...?

తనే మనకి..! తనకి మనమే...!
ఒకరికొకరం మాత్రమే అని తెలుసుకోగలిగితే... వీడని, నీడలా వీడుండలేని బాంధవ్యం ఏర్పడుతుంది వారిలో.

అలా.. ప్రతి రోజూ, ప్రతి క్షణం తనతోనే.. తన వెంటే ఉండీ... అనుకోకుండా ఎడబాటు ఎదురైతే...

16 వ్యాఖ్యలు:

Anonymous said...

చాలా బాగా చెప్పారు.

గీతిక బి said...

ధన్యవాదాలు Anonymous గారూ..

Anonymous said...

chaalaa correct ga ceppaaru...:):)

గీతిక బి said...

Thank you Anon. garu..

Anonymous said...

అనుకోకుండా ఎడబాటు ఎదురైతే .........హుమ్మ్ ....తట్టుకోవటం కష్టమే

buddhamurali said...

ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయిల మధ్య మాత్రమే కాదు.. బాగా చెప్పారు

Unknown said...

ఈ అనంత కాల జీవన పయనం లో
అలా మనసుని తాకి స్వాంతన కలిగించే
బాటసార్లు అప్పుడప్పుడు వస్తూనే వుంటారు
యింకోకల్లు వచ్చేదాకా వీరి తీపి జ్ఞాపకాలు
మనసును బాధించడం సహజమే .
మీ పరిపక్వమైన రాతల్ని అభినందిస్తున్నాను .

గీతిక బి said...

Lalitha garu,
Thank you Lalitha garu...

Murali garu,
Thank you so much for your comment and welcome to my blog.

రవిగారూ..
చాలా భారమైన భావాన్ని సున్నితంగా చెప్పారు. Thank you.

mrityunjay said...

SUPERB!

గీతిక బి said...

Thank you Mrityunjay garu...

నందు said...

u r right madm..... nice one..

గీతిక బి said...

Thank you Anand..

ramya said...

చాలా బాగా చెప్పారు.
తీరిక దొరికితే మీ బ్లాగ్ పూర్తిగా చదవాలి.చాలాబాగా రాస్తున్నారు.

గీతిక బి said...

Thank you Ramya garu...

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

హాయ్! గీతికా!ప్రేమ ఎప్పుడు నిత్య నూతనమ నిస్సందేహం గ, అలాటి
ప్రేమగురుంచి ఎప్పుడుమీరు ఎంతోఉత్తజేంపొందేలారాస్తారు.
ఇది నిజంగఅభినందనీయం.


ప్రేమ ఎప్పుడు ప్రేమని ,ప్రేమించ్దాన్ని, ప్రేమనిపంచాడంన్ని కోరుతుంది.
ప్రేమఎప్పుడు తప్పుఒప్పులు పట్టిక చూడదు.

ప్రేమ ఎప్పుడు అవతలవారి ఆనంద సంతోషాలను ఆశిస్తుంది

ప్రేమ నిరంతర స్రవంతి! ప్రేమ అనంతవాహిని

గీతిక బి said...

It's true and welcome to my blog MANI garu...