29.7.11

"ఈ వారం" వారపత్రికలో బహుమతి పొందిన నా కథ "మిత్ర ఖేదం"...

మిత్ర ఖేదం

ఈ రోజు వినాయక చవితి... చవితంటే ఎంత ఇష్టమో కృష్ణకి.
నా పేరు... మురళి. నా పేరు చెప్పేకంటే ముందు చెప్పాల్సిన పేరు క్రిష్ణది. నేను ఇంకా ఇలా ఉన్నానంటే అది క్రిష్ణ పోసిన ఊపిరే. క్రిష్ణ నా ప్రియ మిత్రుడు. మా స్నేహంలాగే మా పేర్లకీ బాగా జోడీ.

పాతికేళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మేము ఒకరికొకరం దూరమై ఇన్నేళ్ళయ్యిందంటే... ఇప్పటికీ నమ్మశక్యంగా ఉండదు నాకు. కానీ... ఏదో ఒక రోజు క్రిష్ణ వస్తాడని నా నమ్మకం. అది గుడ్డి నమ్మకమేనేమో. ఎందుకంటే ఇన్నేళ్ళలో వాడి ఆచూకీ అయినా తెలియలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడో...! ఎలా ఉన్నాడో...!

* * *
నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి నా వెన్నంటే ఉన్న మంచి స్నేహితుడు క్రిష్ణ. మా ఇద్దరి సామాజిక వర్గాల్లో బేధమున్నా దాన్ని మా స్నేహంలోకి రానీయలేదెప్పుడూ. వాడు పక్కనుంటే చాలు... రోజు ఎంత త్వరగా గడిచిపోతుందో. వాడి మాటల్లోనే కాదు వాడి స్నేహంలోనూ ఏదో కొత్తదనం ఉండేదెప్పుడూ.

మా ఇద్దరిదీ కృష్ణాజిల్లాలోని చిన్న పల్లెటూరు.

ఇంటరు వరకు మా ఊళ్ళోనే చదివాం. మా స్నేహాన్ని నా పెద్దలు చిన్నప్పట్నుంచీ అంగీకరించలేదు. వాళ్ళు ఎంత ఒప్పుకోలేదో అంతగా బలపడసాగింది మా స్నేహం. డిగ్రీ కోసం విజయవాడలో రూము తీసుకున్నాం ఇద్దరం. కాకపోతే వాడు చదువులో కొంచెం వీక్. అప్పుడప్పుడు (పరీక్షలప్పుడు మాత్రమే) నా ఆన్సర్ పేపర్లతో వాడికి స్ట్రెంత్ ఇవ్వాలని ట్రై చేసేవాణ్ని.

పగలు కాలేజీ క్లాసులు, సాయంత్రాలు... చల్లగాలికి 'ప్రకాశం బ్యారేజీ' మీదో, 'వారధి' దగ్గరో, లేదూ 'అక్కన్న మాదన్న గుహ'ల్లోనో. ఇక ఆదివారాలొస్తే 'బీసెంట్ రోడ్డు', 'లెనిన్ సెంటర్ల'లో ఆవారా తిరుగుడు. ఉండేది 'కాంథారి' హోటల్ దగ్గరయినా మేము (స్టూడెంట్ బస్ పాసుతో) ఆర్టీసీ ముద్దుబిడ్డలవడం వల్ల విజయవాడంతా మాదే అన్నట్టు తిరిగేవాళ్ళం.

అందులోనూ క్రిష్ణ ప్రక్కనుంటే అసలు టైమే తెలిసేది కాదు. చాలా సరదా మనిషి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ, జోకులేస్తూ, వాళ్ళనీ వీళ్ళనీ కామెంట్ చేస్తూ... తెగ నవ్విస్తుండేవాడు. అంత జోవియల్‍గా ఉండే వాడిలో ఇంత గాఢత ఉందని ఆ దుర్ఘటన జరిగేవరకు నాకూ తెలీదు.

ఆ దురదృష్టకర రోజుని నా జీవితంలో మర్చిపోలేను నేను. ఎందుకంటే ఆ రోజూ వినాయకచవితే. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల, చేసిన పని వల్ల ఓ అమాయకురాలు బలవన్మరణం పాలయితే నా ప్రాణ మిత్రుడు క్రిష్ణ నాకు దూరమయ్యాడు. అంటే చనిపోయాడని కాదు... నన్ను వదిలి వెళ్ళిపోయాడు.

'ఆరోజు' గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు గిల్టీనెస్‌తో, అపరాధ భావంతో నలిగిపోతుంది.. ఇప్పటికీ.

* * *
* * *
* * *
* * *
* * *
prize winning story- ee varam - katha

14 వ్యాఖ్యలు:

Anonymous said...

chala bagundi

రాజేష్ మారం... said...

Excellent.. Loved it...

నందు said...

bhavundhi....

గీతిక బి said...

Thank you Anonymous, Rajesh garu and Anand..

నైమిష్ said...

గీతిక గారు..చాలా బాగుందండీ కథ..

ప్రసూన said...

very nice story. keep writing more...

గీతిక బి said...

@ ధన్యవాదాలు నైమిష్ గారూ..

@ Thank you for your comment and wish ప్రసూన గారూ..

Anonymous said...

గీతిక గారు కధ బావుందండీ !
<<>>>.....వాళ్ళు కలుసుకున్నట్టేనా ?

గీతిక బి said...

మీరేమనుకుంటున్నారు...?

మురళీ_ కృష్ణవాళ్ళ చెల్లి Vasanthaని చేసుకుని ఇల్లరికం వచ్చింది.. కృష్ణ ఏ రోజునైనా అతని ఇంటికి వస్తాడన్న ఆశతో. ఇప్పుడు కృష్ణ వచ్చాడు అంటే మురళీ, కృష్ణలు కలుసుకున్నట్టే కదండీ.

మీ కామెంట్‌కి ధన్యవాదాలు లలిత గారూ.

అప్పుడెప్పుడో మీ బ్లాగులో వజ్రం(రాయి) గురించిన పోస్ట్ చదివినట్టు గుర్తు. మీరే కదా వ్రాసింది.

దాన్ని ఇంకా గోడకి మేకులు కొట్టడానికీ, కుంకుళ్ళు కొట్టడానికే వాడుతున్నారా...?

మురళి said...

"కానీ... అదే నా జీవితాన్నింత మలుపు తిప్పి, నలుగుర్లో దోషిగా నిలబెడుతుందని, నా ప్రియమిత్రుడు కృష్ణని దూరం చేస్తుందని నాకు తెలీదప్పుడు."ఇలాంటి వాక్యాలని పరిహరించ వచ్చు అనిపించిందండీ.. కొరుకుడు పడని మరో విషయం ఏమిటంటే, ప్రేమించిన అమ్మాయి పెళ్లి వద్దనుకుని వచ్చేస్తోందని తెలిసిన క్షణం ఏ అబ్బాయయినా ఆవిషయాన్ని మొదట పంచుకునేది ప్రాణ స్నేహితుడితో.. ఆఫ్ కోర్స్, తల్లితోనూ చెప్పినా, స్నేహితుడి తర్వాతే.. ముందుగా తల్లితో చెప్పడం వల్ల కథకి ఏదన్నా మలుపు వస్తుందేమో అనుకున్నా. అంటే, కొడుక్కి ఏమన్నా అవుతుందన్న భయంతో ఆ తల్లి, తండ్రిని అలెర్ట్ చేయడం లాంటివి.. చదువైపోయి, చిన్నదే అయినా ఉద్యోగం చేస్తున్న హీరో జైల్లో ఉన్న స్నేహితుడికీ, బయట ఉన్న అతని కుటుంబానికీ తన తండ్రి కారణంగా సాయం చేయలేక పోయాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళని ఎదిరించి స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కొంచం క్లారిటీ లోపించింది.. ఇంకో విషయం, అప్పటికే మరో అమ్మాయితో పీకలోతు ప్రేమలో ఉన్న హీరో వసంతాని పెళ్లి చేసుకోవడం ఆమెకి అన్యాయం చేయడం కాదా?
....కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నానని అనుకోకండి. మీ ప్రెజెంటేషన్ బాగుంది. వినాయక చవితిని నేపధ్యంగా తీసుకోవడం, నాయికా నాయకుల తొలి పరిచయం ఇలాంటివన్నీ బాగున్నాయి.. మరిన్ని మంచి కథలు మీ నుంచి రావాలని కోరుకుంటూ...

గీతిక బి said...

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు మురళీ గారూ.

మీ ప్రశ్నలకి వివరణ క్రింద ఇస్తున్నాను. జవాబుల్లో అవసరమైన చోట కథలోని కొన్ని వాక్యాల్ని ఉదహరించాను.

1. //కానీ... అదే నా జీవితాన్నింత మలుపు తిప్పి, నలుగుర్లో దోషిగా నిలబెడుతుందని, నా ప్రియమిత్రుడు కృష్ణని దూరం చేస్తుందని నాకు తెలీదప్పుడు//

ఈ వాక్యం లేకపోయినా పర్లేదుగానీ... సుధని ప్రేమించడం అన్నదాని వల్లే ఇదంతా జరిగింది అనుకున్న మురళి దృష్టితో వ్రాసిన వాక్యమది.

2. //కొరుకుడు పడని మరో విషయం ఏమిటంటే, ప్రేమించిన అమ్మాయి పెళ్లి వద్దనుకుని వచ్చేస్తోందని తెలిసిన క్షణం ఏ అబ్బాయయినా ఆవిషయాన్ని మొదట పంచుకునేది ప్రాణ స్నేహితుడితో..//

నిజమే. ఎవరైనా మొదట పంచుకునేది స్నేహితునితోనే. కానీ పిజి అయిపోయాక మురళికి కృష్ణతో ప్రత్యక్షంగా కమ్యూనికేషన్ లేదు. తన కుటుంబం, సుధతో మాత్రమే అతనికి ఫోన్ సంభాషణలు. కృష్ణకు సంబంధించిన విషయాలు కూడా కృష్ణ ద్వారా కాక తల్లి ద్వారానే తెలుస్తున్నాయనడానికి వ్రాసిందే క్రింది వాక్యం.
//క్రిష్ణ మా ఊర్లోని పచారీ కొట్లో పద్దులు వ్రాసుకుంటూ, దానికి తోడుగా కౌలుకి వ్యవసాయం చేస్తున్నాడంట//
కొడుకులకి తల్లి దగ్గర (అన్ని విషయాలూ చెప్పగలిగేంత) చనువు ఎక్కువని చెప్పడం కూడా నా ఉద్దేశ్యం.

3. //చదువైపోయి, చిన్నదే అయినా ఉద్యోగం చేస్తున్న హీరో జైల్లో ఉన్న స్నేహితుడికీ, బయట ఉన్న అతని కుటుంబానికీ తన తండ్రి కారణంగా సాయం చేయలేక పోయాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళని ఎదిరించి స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కొంచం క్లారిటీ లోపించింది..//

తన వల్ల స్నేహితుడు జైలుకెళ్ళడం ఒక పక్క బాధనిపించినా... స్నేహితుడిని జైలులో అలా (//బాగా చిక్కిపోయి చాలా నిర్లిప్తంగా ఉన్నాడు వాడు.//) చూశాక ఆల్రెడీ తనలో ఉన్న న్యూనత వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాడు మురళి.
ఏదైనా ఒక విషయం.. చెయ్యడానికి మొదట మనం తటపటాయించినా... మనసుకి హత్తుకున్న, మనసుని కదిలించిన విషయం గురించి ఎంతకన్నా తెగిస్తాం కదా.

4. //అప్పటికే మరో అమ్మాయితో పీకలోతు ప్రేమలో ఉన్న హీరో వసంతాని పెళ్లి చేసుకోవడం ఆమెకి అన్యాయం చేయడం కాదా?//

వేరే అమ్మాయిని (సుధని) ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ఆ అమ్మాయి(సుధ) _ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్నా, స్నేహితుడు జైలుకి వెళ్తున్నా... నోరు తెరిచి ఇదంతా నా వల్లేనని చెప్పలేనప్పుడు, మరెవరినో పెళ్ళి చేసుకున్నప్పుడు (//ఇన్ని గొడవల మధ్య కేంద్ర బిందువైన సుధకి పెళ్ళైపోయింది. డబ్బు అన్నింటినీ కప్పిపుచ్చుద్దేమో.//) కూడా ఆమె మీది ప్రేమ అలాగే ఉంటుందంటారా...? కృష్ణ జైలుకెళుతూ చెప్పిన మాట //అమ్మా, చెల్లీ జాగ్రత్తరా..// అని. ప్రేమించిన సుధే లేనప్పుడు మరెవర్నో చేసుకునేకంటే తనవల్ల అన్యాయమైన కుటుంబానికి న్యాయం చెయ్యాలి అన్న తపనతో వసంతని చేసుకున్నాడు.

bhagavandas said...

akka story chala chala bagundhi akka. comments lo murali gariki vivarana chadivinapudu enka baga artham ayindi. story okasare nonstopga chaduvanu... antha interestinga undhi story flow. finishing adiripoindi akka. murali good friend ani prove chesukunnadu. story chadivinapudu edo daaham teerinattu anipinchindi. storys chadivi chalarojulu ayindi andukenemo.

గీతిక బి said...

Thank you for your compliments and comment Bhagavan Das..

Anonymous said...

hi
Geetha garu
I read the story forwarded by my friend to my g mail
its really good
after a long time I read a good Telugu story.
thank you very much