13.3.10

ప్రేమలో మనం...

మనం ప్రేమిస్తాం, ప్రేమించబడతాం. మన బంధాలు, అనుబంధాలు నిలబడేది ఆ ప్రేమ వల్లే.

జీవించడానికి ఆశని కల్పిస్తుంది ప్రేమ. ఒక్కోసారి మన జీవితాన్నే శాశించేస్తుంది అదే ప్రేమ. ప్రేమలో నాకిలా ఉందని, మీకలా జరిగిందని... అందరికీ అలాగే ఉండదు, అలాగే జరగదు. నేను ప్రేమనుకునేదానికీ, మీ దృష్టిలో ప్రేమకీ పోలికే ఉండకపోవచ్చు.
ప్రేమంటే ఇష్టంలాంటి ఓ ఫీలింగ్ అనుకునేదాన్ని నేను. కానీ- నేను ప్రేమించబడడం మొదలైనప్పుడు,.. ప్రేమను పొందుతూ ఉన్నప్పుడు,.. ప్రేమలో మునిగి ఉన్నప్పుడు తెలిసింది... ప్రేమ సముద్రమంత పెద్దదనీ. అలా నాకే కాదు.. ప్రేమను అనుభూతించిన అందరికీ అనీ, నా నమ్మకం.
అందుకే నా ఊహలు, ఆలోచనలు నిండిన "ప్రేమలో నేను" నుంచి "ప్రేమలో మనం" వైపు నా అడుగులు...

0 వ్యాఖ్యలు: