Showing posts with label నా పెయింటింగ్స్. Show all posts
Showing posts with label నా పెయింటింగ్స్. Show all posts
4.4.11
16.12.10
11.9.10
9.9.10
నేను మళ్ళీ బొమ్మలు వెయ్యడం వెనుక కథ...
posted by గీతిక బినేను స్కూల్ రోజుల్లో బొమ్మలు బాగా వేసేదాన్ని.
బాగా అనేది నా ఫీలింగ్ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పట్నుంచీ మొహమాటం కొంచెం ఎక్కువ పాళ్ళలో ఉన్నందువల్ల నేను వేసిన బొమ్మలు ఎవరో ఒకరిద్దరికి తప్ప చూపించేదాన్ని కాదు. చూసిన ఆ ఒక్కరూ ఇద్దరూ కూడా ఎప్పుడూ బొమ్మలో ఒక ఏదో వంక చూపించి నవ్వేవారు. దాంతో వెయ్యడమే మానేశాను. వేసినా ఎవరికీ చూపించకూడదని నిర్ణయించేసుకున్నాను.
ఇక కాలేజీలోకొచ్చాక బొమ్మలు వేసేంత తీరిక లేకపోవడానికి ముఖ్య కారణం పిచ్చాపాటి రాతల్లో మునిగి తేలడమే. ఇక అప్పట్నుంచీ పెన్సిల్ గీతలు నా నుంచి దూరమైపోతూ వచ్చాయి.
డిగ్రీ అయ్యేసరికి- "ఒకప్పుడు నేను బొమ్మలు వేసేదాన్ని..." అన్న విషయం కూడా మర్చిపోయాను.
మళ్ళీ ఇన్నాళ్ళకి...! సుమారుగా పదేళ్ళ తర్వాత... ఈ మధ్యే ఒక్కొక్కటీ వేస్తున్నా. అది కూడా పదేళ్ళ క్రితం చివరగా నేను వేసిన ఆర్ట్స్ చూసి అతను మరీ మరీ ప్రోత్సహించడంతో...
ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్నట్లుగా ఉంది... షో కేసులో కనిపించిన బొమ్మలూ, గోడ మీది లామినేషన్లూ, ఏ బొమ్మ కనిపిస్తే దాన్ని గీసి పారేస్తున్నాను.
ఈ రోజు కొంచెం కుదురుగా కూర్చొని వేసిన బొమ్మ ఇది...
తను బావుందన్నా ఇందులో ఇంకేదో పర్ఫెక్ట్ నెస్ రావాలన్న ఫీలింగ్ నాకు...

3.9.10
అభిసారిక...
posted by గీతిక బిఅభిసారిక...
ఈ క్షణం
నువు నా చెంతన లేవని
కుంగిపోను నేను.
నా ఎదురు చూపులు
నిన్ను చూసి
జీవం పోసుకుని,
మిల మిల మెరిసే
క్షణాల కోసం..
ఆశ పడతాను.
వసంతం ఇచ్చే
చివురాకుల కోసం-
కోకిలలా,
చంద్రుడు చూసే
ఓర చూపు కోసం-
కలువలా,
నీ రాక కోసం...
నీ చుట్టూ
నా శ్వాసని ముడేసి,
క్షణ క్షణం
నీ తలపుల్ని శ్వాసిస్తూ,
నీ కోసం
ఎన్నాళ్ళైనా
ఎదురు చూసే
ఆశా జీవిని నేను...!
27.8.10
అమ్మకు అంకితం...
posted by గీతిక బి23.7.10
విరహ వేదన...
posted by గీతిక బి16.7.10
ప్రేమో.., మాయో..., ప్రేమే మాయో...!
posted by గీతిక బి
ప్రేమో.., మాయో..., ప్రేమే మాయో...!
ఈ చిన్ని మనసులో
ఏదో అలజడి...!
ఎందుకో తెలీక
అది ఏదో అర్థం కాక
వాన జల్లుల్లో స్వాతి చినుకై..
తుషార తుంపరల్లో నీటి బిందువై..
ఘనీభవించిన జ్ఞాపకాలు,
కరిగిపోయిన కాలప్రవాహ ఒరవడిలో
మిగిలిపోయిన గతం తాలూకు స్మృతులు,
ఎన్నో...!
ఎవరో గిలిగింతలు పెట్టినట్లు
ఏవో జ్ఞాపకాలు తికమక పెడుతుంటే
నా మనసులో
అదేదో అలజడి (?)
అది ఇష్టమో, అభిమానమో, ఆరాధనో...
నాతో దాగుడు మూతలాడుతూ
తన చిరునామా తెలుపక
నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది.
ఆ పిచ్చి ఏదో కాదు...
'మనసు'లో పుట్టిన ప్రేమ వల్ల
'మన' లో కలిగే పిచ్చి...!
ఎదురుగ ఎందరున్నా
అందర్లోనూ నువ్వే కనిపిస్తూ,
ఎవరి మాటలు వింటున్నా
నీ పిలుపులే ప్రతిధ్వనిస్తూ,
ఏంటీ మాయ...?
ప్రేమంటే మాయా...?
? ? ? ? ? ? ?
ఈ నీలికనులు కూడా...
వ్యక్తం చేయలేని భావాలు
ఎన్నో నాలో
అర్థం చేసుకోగలవా... నేస్తం...!
ఈ చిన్ని మనసులో
ఏదో అలజడి...!
ఎందుకో తెలీక
అది ఏదో అర్థం కాక
వాన జల్లుల్లో స్వాతి చినుకై..
తుషార తుంపరల్లో నీటి బిందువై..
ఘనీభవించిన జ్ఞాపకాలు,
కరిగిపోయిన కాలప్రవాహ ఒరవడిలో
మిగిలిపోయిన గతం తాలూకు స్మృతులు,
ఎన్నో...!
ఎవరో గిలిగింతలు పెట్టినట్లు
ఏవో జ్ఞాపకాలు తికమక పెడుతుంటే
నా మనసులో
అదేదో అలజడి (?)
అది ఇష్టమో, అభిమానమో, ఆరాధనో...
నాతో దాగుడు మూతలాడుతూ
తన చిరునామా తెలుపక
నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది.
ఆ పిచ్చి ఏదో కాదు...
'మనసు'లో పుట్టిన ప్రేమ వల్ల
'మన' లో కలిగే పిచ్చి...!
ఎదురుగ ఎందరున్నా
అందర్లోనూ నువ్వే కనిపిస్తూ,
ఎవరి మాటలు వింటున్నా
నీ పిలుపులే ప్రతిధ్వనిస్తూ,
ఏంటీ మాయ...?
ప్రేమంటే మాయా...?
? ? ? ? ? ? ?
ఈ నీలికనులు కూడా...
వ్యక్తం చేయలేని భావాలు
ఎన్నో నాలో
అర్థం చేసుకోగలవా... నేస్తం...!
Subscribe to:
Posts (Atom)