Showing posts with label నా పుస్తకాలు. Show all posts
Showing posts with label నా పుస్తకాలు. Show all posts

7.10.23

"చదువు" యాప్‌లోని నా నవలలు...

 ప్రియమైన మిత్రులందరికీ శుభోదయం... 

"స్వాతి వీక్లీ"లో వారంవారం నా సీరియల్స్ చదువుతూ, అవి నవలలుగా ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్న అభిమాన పాఠకులందరికీ శుభవార్త.. 

ఇప్పుడు నా నవలలు ఆన్‌లైన్‌లో మీకు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ మీద నేను వ్రాసిన, చాలా అద్భుతమైన రెస్పాన్స్ పొందిన నా "చెలగాటం" నవల, అలాగే రోబోటిక్ టెక్నాలజీ పై నేను వ్రాసిన "అందాల ఆడబొమ్మ" నవల ఇప్పుడు "చదువు" యాప్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి.

అలాగే నా నవలలు మీరు ఇంకా యేమేమి చదవాలి అనుకుంటున్నారో తెలియజేస్తే వాటిని కూడా "చదువు" యాప్‌లో మీకు అందుబాటులోకి తెస్తాను. 

మీరు ఇప్పటికే "చదువు" మొబైల్, టాబ్ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉంటే నా రచనల్ని మీరు ఉచితంగా చదువుకోవచ్చు. నా రచనలతో పాటూ ఇంకా అనేకమంది రచయిత(త్రు)ల ఎన్నో రచనల్ని కూడా మీరు ఉచితంగా చదవొచ్చు. చదివే వీలు లేనప్పుడు వేరే పనులు చేసుకుంటూ కొన్నిటిని ఆడియో రూపంలో కూడా వినొచ్చు. 

ఒకవేళ మీరు కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే సంవత్సరానికి ఋస్. 399/- మాత్రమే. ఈ ప్లాన్‌తో సంవత్సరం అంతా ఎన్నో పుస్తకాల్ని అన్‌లిమిటెడ్‌గా చదువుకోవచ్చు, ఆడియో బుక్స్‌ని కూడా వినవచ్చు.


5.5.15

నా "ఇసుక పూలు" కథా సంపుటి ఇప్పుడు కినిగెలో...

నా "ఇసుక పూలు" కథా సంపుటి 
ఇప్పుడు కినిగెలో ....




link: 


20.9.14

ఇసుకపూలుపై ఆంధ్రభూమి దిన పత్రిక లో...మరో సమీక్ష


ఈ రోజు *ఆంధ్రభూమి దిన పత్రిక* "అక్షర" లో...

నా కథాసంపుటి ఇసుకపూలు పై మరో సమీక్ష వచ్చింది. 

ఆంధ్రభూమి దిన పత్రిక వారికీ, సమీక్ష వ్రాసిన కూర చిదంబరం గారికీ ధన్యవాదాలు...


geetika kathalu - andhrabhumi - isuka pulu

16.7.14

నా కథా సంపుటి.. ఇసుక పూలు...



నా కథా సంపుటి.. ఇసుక పూలు... 
కాపీలు విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచ్‌లలో లభ్యమవుతాయి.



geetika kathalu -isuka poolu - isukapulu - b geetika

20.3.14

నా రెండవ పుస్తకం...

నా రెండవ పుస్తకం...  నానీల చినుకులు


పుస్తకం కోసం ఈ ఫోన్నెంబరులో 99080 63266 గానీ, 
విశాలాంధ్ర బ్రాంచ్‌లలో గానీ సంప్రదించగలరు.


geetika nanilu - naaneelu - nanila chinukulu

3.11.13

నా తొలి పుస్తకం.. "ప్రేమలో మనం"




సాక్షి ఆదివారం అనుబంధం ఫన్‌డేలో 
28-09-2008 నుంచి 23-08-2009 వరకు 
ప్రచురింపబడ్డ ప్రేమ శీర్షికని ఇప్పుడు

ప్రేమలో మనం 

అనే పుస్తకంగా తీసుకువచ్చాను. 

ఈ పుస్తకం కావలసినవారు ఈ ఫోన్ నెంబరు 099080 63266 లో గానీ, 
లేదా విశాలాంధ్ర (అన్ని బ్రాంచ్‌)లోనూ సంప్రదించగలరు. 



premalo manam - geetika - geetika books