ప్రియమైన రచయిత(త్రు)లకు, పాఠక మిత్రులకు ఒక శుభవార్త...
సాహిత్య.కాం వెబ్సైట్ వారు సాహిత్య.కాం ప్రారంభం సందర్భంగా "అరంగేట్రం కథల పోటీ"ని నిర్వహిస్తున్నారు.
ఆ వివరాలు అందరి కోసం...
--------‐--------‐----‐‐-----------
అరంగేట్రం కథల పోటీ బహుమతుల వివరాలు
మొదటి బహుమతి 5,000
రెండవ బహుమతి 2,500
మూడవ బహుమతి 1,000
ఇవి కాక ఎంపిక చేసిన ప్రతి కథకీ 300/- గౌరవ పారితోషికం, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి.
కథల పోటీ నిబంధనలు:-
1. కథాంశం మీ ఇష్టమే అయినా పట్టుగా చదివించి, మనసుకి హత్తుకునే, ఆశావహ దృక్పధంతో ఉన్న వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యం.
2. మీరు పోటీకి పంపే కథలను saahithyacontest@gmail.com అనే ఈమెయిల్ ఐడీకు పంపాలి. మీ కథ అనువాదమూ, కాపీ కాదనే హామీని ఈమెయిల్లో వ్రాయాలి. కథలపోటీకి సంబంధించిన ప్రశ్నోత్తరాలకి ఈ ఈమెయిల్లోనే సంప్రదించాలి.
3. కథ ఎ4 సైజులో డిటిపి చేసిన పిడిఎఫ్ ఫార్మెట్లో గానీ, యూనికోడ్లో గానీ 10 పేజీలు ఉండాలి.
4. మీరు పోటీకి పంపుతున్న పోటీ కథలను సాహిత్య.కాం లో మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ ఎకౌంట్లో తప్పకుండా అప్లోడ్ చెయ్యాలి.
5. కథలను ఎంపిక చెయ్యడానికీ, కథల పోటీ గడువుని పొడిగించడానికీ, పోటీని రద్దు చేయడానికి, బహుమతి మొత్తాలలో మార్పులూ చేర్పులూ చెయ్యడానికీ సాహిత్య.కాం యాజమాన్యానికి సర్వహక్కులూ ఉన్నాయి.
అరంగేట్రం కథలపోటీ కోసం కథలను పంపాల్సిన ఆఖరి తేదీ 30-11-2023
మీ కథలను పంపాల్సిన ఈమెయిల్ ఐడీ... saahithyacontest@gmail.com
--------‐--------‐----‐‐-----------
మీ సందేహాలకు, మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్‌ని కాంటాక్ట్ చెయ్యండి.. ఫోన్: 9030959777